amp pages | Sakshi

ప్రజాస్వామ్య విలువలకు పాతర

Published on Sun, 03/24/2019 - 08:10

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది. అక్రమ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొన్నారు. ప్రజాతీర్పుకు విలువ లేకుండా చేశారు. ఓటుకు పది వేలు ఇచ్చేందుకూ సిద్ధమంటున్నారు. అధికారులను బెదిరించి, భయపెట్టి పార్టీ కార్యకర్తల్లా మార్చేశారు. సీఎంగా భరోసా కల్పించాల్సిన వ్యక్తి భయపెడుతూ పాలన సాగించారు. అధికార పార్టీ నేతలు చెబితేనే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే పరిస్థితి రాష్ట్రంలో  ఉంది. రాజధాని పేరిట రైతుల నుంచి భూములను లాక్కొని.. తన వాళ్లకు, విదేశీ కంపెనీలకు భూపందేరం చేస్తున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఎన్నికల్లో నోటుకు అమ్ముడుపోతే సర్వం కోల్పోయినట్లే. ప్రశ్నించే హక్కును చేజేతులారా వదిలేసుకున్నట్లే. ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం సరిగా స్పందించడం లేదు’ అంటున్నారు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి. ‘సాక్షి’కి  ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్రంలో అవినీతి, అస్తవ్యస్త పాలనపై నిర్మొహమాటంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన సొంత మాటల్లోనే....  

‘‘డబ్బు తీసుకుని ఓటు వేయడం ద్వారా.. ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోతున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే.. ఊరికే ఓటు వేశావా.. డబ్బు తీసుకునే కదా..! అంటూ నేతలు ఎదురు ప్రశ్నించే పరిస్థితి వస్తోంది. ప్రశ్నించే హక్కును కోల్పోతే.. సర్వం కోల్పోయినట్లే! 
 
‘‘ఓటర్లు గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్‌ కేంద్రానికి వెళితే.. ఓటర్ల జాబితాలో పేరు లేదు, ఓటు వేయడం కుదరదంటున్నారు. గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు.. అతనికి ఓటు వేసే అవకాశం ఇవ్వకపోతే, మరి ఆ గుర్తింపు కార్డుకున్న విలువ ఏమిటి? ఓటర్ల ప్రమేయం లేకుండానే వారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి మాయం అవుతున్నాయి’’ 


సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం  చేసేలా ఐదేళ్ల పాలన సాగింది. పార్టీకి, ప్రభుత్వానికి తేడా లేకుండా పాలించారు. పార్టీయే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నట్లుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య విలువలకు పాతరేశారు. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పార్టీతో సంబంధం లేకుండా పాలన సాగాలి. రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా చంద్రబాబు.. ఇది టీడీపీ పాలన అన్నట్లు చేశారు. వాళ్ల పార్టీకి చెందిన వారికే మేలు చేశారు. ఉద్యోగులను కూడా పార్టీ కార్యకర్తల్లా మార్చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా వదల్లేదు. వారి విషయంలోనూ ఇదే ధోరణితో వ్యవహరించారు. 2014లో ఐఏఎస్, ఐపీఎస్‌లను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడిన మాటలను ఇక్కడ గుర్తు చేయదలిచాను. అధికారులంతా మాకు అనుకూలంగా పనిచేయాలి. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం దురదృష్టకరం. మీ విధుల్లో మా జోక్యం ఉండదు.. నిష్పక్షపాతంతో  విధులు నిర్వర్తించండి.. పార్టీలకు అతీతంగా వ్యవహరించండి అని చెప్పాల్సింది పోయి.. పార్టీ కార్యకర్తల కోసమే పనిచేయమని చెబుతారా? సీఎంగా భరోసా కల్పించాల్సిన వ్యక్తి, భయపెడుతూ పాలన సాగించారు.  
 
వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా :  
ప్రభుత్వంపై, వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా చేశారు. ఎక్కడ చూసినా ఆశ్రితపక్షపాతం, అవినీతి. అధికారులను చెప్పుచేతుల్లో పెట్టుకుంటే.. అవినీతికి అడ్డూఅదుపే ఉండదు. అందుకే నయానో భయానో అధికారులను తమ దార్లోకి తెచ్చుకున్నారు. ఏ పార్టీకి చెందని తటస్థ వ్యక్తి..ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లితే పని జరగదు. చాలాసార్లు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. చివరకు డబ్బులిచ్చి పనిచేయించుకోవాల్సిన దుస్థితి. ప్రతి చిన్న పనికీ అధికార పార్టీ నేతలను తీసుకురావడమో, వారితో సిఫారసు చేయించడమో తప్పనిసరైపోయింది. చివరకు పోలీసులు కూడా అధికార పార్టీ నేతల నుంచి సిఫారసు వస్తే తప్ప కేసు కూడా నమోదు చేయడం లేదంటే.. ఈ రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ అధికారుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. వీళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫారసు ఉంటే తప్ప పనిచేయడం లేదు.  
 
ముఖ్యమంత్రే తప్పు చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి?
ఫలానా పనికి ఫలానా రేటు అంటూ వాటాలు పంచుకుంటున్నారు. కాంట్రాకర్టు చేసిన పనులకు సైతం బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లులు చెల్లించాలంటే.. లంచం ఇవ్వాల్సిందే. కాంట్రాక్ట్‌ రావాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందే. రాజకీయ నాయకులు, అధికారులు కుమ్కక్కై ప్రజలను దోచుకుంటున్నారు. నీకు ఇంత.. నాకు అంత అంటూ.. వాటాలు వేసుకుని ప్రజల డబ్బును పంచుకుంటున్నారు. కింది స్థాయి అధికారి తప్పు చేస్తే, పై అధికారికి చెబుతారు. పై అధికారి తప్పు చేస్తే ప్రజా ప్రతినిధులకు చెప్పాలి. ప్రజా ప్రతినిధులు తప్పు చేస్తే.. మంత్రికి.. మంత్రులు తప్పు చేస్తే చివరకు సీఎంకి చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి అలాంటి వ్యక్తే తప్పు చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి.. ఎవరికి చెప్పుకోవాలి..? ఇంతకంటే ప్రభుత్వ వైఫల్యం ఏముంటుంది?  
 
టెండర్‌ వ్యవస్థను దిగజార్చి :  
కావాల్సిన వారికోసం టెండర్‌ నిబంధనలనే మార్చేశారు. ఎవరికి పనులు ఇవ్వాలనుకుంటున్నారో.. వారికే కట్టబెడుతున్నారు. టెండర్ల వ్యవస్థను దిగజార్చారు. అర్హతల ప్రకారం ఎవరైనా పనులు దక్కించుకుంటే.. వారిని బెదిరిస్తున్నారు. కమీషన్‌ ఇచ్చేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ మీకో ఉదాహరణ చెబుతాను. ఓ ప్రాజెక్టుకు సంబంధించి ముగ్గురు టెండర్లు వేశారు. ఎల్‌3గా  వచ్చిన వ్యక్తి ప్రభుత్వానికి కావాల్సి వ్యక్తి. ఎల్‌1ని బెదిరించడంతో అతను  తప్పుకున్నాడు. ఎల్‌2 దారికి రాకపోవడంతో.. ఎక్సెస్‌ వేసిన మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఒప్పుకోకపోవడంతో ఏవేవో సాకులు చెప్పి కాంట్రాక్ట్‌ రద్దు చేయించారు. 
 
విదేశీ కంపెనీలకు దాసోహం : 
స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో పారదర్శకత లేదని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ ఎత్తి చూపింది. వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చింది. అయినా ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకోకుండా..తమ దోపిడీకి అడ్డుగా ఉన్న చట్ట నిబంధనలనే మార్చేసింది. ఆ కంపెనీల స్థితిగతులను కూడా తెలుసుకోలేదు. కంపెనీలపై కేసులు వేయాలంటే..ఆ కంపెనీలు ఉన్న దేశాల్లోనే వేయాలట. ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఇదెక్కడి అరాచకం. ఎవ్వరూ నోరు మెదపకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇవన్నీ చేసింది. స్విస్‌ ఛాలెంజ్‌ కింద ఏం చేసినా కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ద్వారానే చేయాలి. కాని ఈ ప్రభుత్వం ఆ అథారిటీని నిర్వీర్యం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఈ అథారిటీకి  అధికారాలు లేకుండా చేశారు. తాము చేసే అక్రమాలు ఎవరికి తెలియకుండా ఉండేందుకు, తెలిసినా అడ్డు చెప్పకుండా ఉండేందుకే ఈ చట్ట సవరణ చేశారు. 
 
పంట భూములు లాక్కున్నారు : 
రాజధాని కోసమంటూ మూడు పంటలు పండే భూములను లాక్కున్నారు. చాలాచోట్ల పూలింగ్‌ కింద భూములు ఇవ్వకున్నా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. చట్ట ప్రకారం భూ సేకరణ చేయలేదు. రైతుల భూములు ప్రభుత్వపరం కాక ముందే.. వాటిని విదేశీ కంపెనీలకు పందేరం చేయడం మొదలుపెట్టారు. ప్రాజెక్టుల విషయంలో అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకునే నాథుడే లేడు. ఎవరైనా అధికారి గట్టిగా మాట్లాడితే కక్ష సాధింపు చర్యలు. కీలక స్థానాల్లో ఉన్న అధికారులు అభ్యంతరం చెబితే.. వాటిని ఖాతరు చేయకుండా క్యాబినెట్‌ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారే చెబుతున్నారంటే.. ఈ పాలన ఎంత అరాచకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
ఆ కంపెనీలకు అణాపైసలకు భూములు : 
భూముల కేటాయింపుల్లో కూడా ఇష్టారాజ్యమే. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలకు కోట్ల రూపాయల ధరతో భూములు కేటాయిస్తున్నారు. అదే తమకు కావాల్సిన ప్రైవేటు కంపెనీలకు మాత్రం నామమాత్రపు ధరలకు భూములు ఇచ్చేస్తున్నారు. ఈ ప్రైవేట్‌ కంపెనీలకు ఉన్న అర్హతలు ఏమిటి.. వాటి స్థితిగతులుæ.. ఉపాధి కల్పించే సత్తా ఆ కంపెనీలకు ఉందా? అన్న విషయాలను పట్టించుకోవడం లేదు. దొడ్డిదారిన పైరవీలతో వస్తే చాలు.. బహిరంగ మార్కెట్‌లో కోట్ల విలువ చేసే భూమి కూడా అణా పైసలకు ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం కేటాయించే భూముల ధరలను నిర్ణయించేందుకు ఓ కమిటీ ఉంటుంది. ధరల విషయంలో ఈ కమిటీదే తుది నిర్ణయం. కాని ఏపీలో అందుకు విరుద్ధంగా ప్రభుత్వ పెద్దలే భూముల ధరలు నిర్ణయించేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఎకరాకు రూ.5కోట్లు వసూలు చేస్తారు. అనామక కంపెనీలకు మాత్రం రూ.50 లక్షలకే భూమి ఇచ్చేస్తారు. రికార్డుల్లో ధరలను వేరుగా ప్రస్తావిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో కోట్ల రూపాయలను జేబులో వేసుకుంటున్నారు. 
 
స్పీకర్‌కున్న  ఆ అధికారాలను రద్దు చేయాలి : 
పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ అధికార పార్టీకి వంత పాడటం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ఫిరాయింపులు పెరిగిపోవడానికి స్పీకర్‌ వ్యవహరిస్తున్న తీరు ప్రధాన కారణం. ఫిరాయించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. స్పందించడం లేదు. అందుకే ఫిరాయింపుల విషయంలో స్పీకర్‌కున్న అధికారాల్ని వెంటనే రద్దు చేయాలి. ఆ మేరకు చట్ట సవరణ చేయాలి. ప్రస్తుతం స్పీకర్‌కున్న అధికారాలను ఎన్నికల సంఘానికి లేదా న్యాయస్థానాలకు అప్పగిస్తూ చట్ట సవరణ తీసుకురావాలి. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోకపోతే, అది ఫిరాయింపులను మరింత ప్రోత్సహించినట్లవుతుంది. అధికారంలోకి వచ్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేను రూ.100 కోట్లు పెట్టి కొనేందుకు సైతం వెనుకాడరు. ఈ ధోరణి వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. అక్రమ సంపాదన వల్లే ఫిరాయింపులను ప్రోత్సహించగలగుతున్నారు. 
 
ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోతున్నారు
డబ్బు తీసుకుని ఓటు వేయడం ద్వారా.. ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోతున్నారు. ఒకవేళ ఎవరైనా   ప్రశ్నిస్తే, ఊరికే ఓటు వేశావా.. డబ్బు తీసుకునే కదా.. అంటూ నాయకులు ఎదురు ప్రశ్నించే పరిస్థితి వస్తోంది. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. ఎన్నికల్లో ప్రజా సేవ చేయడానికి ఎవ్వరూ పోటీ చేయడం లేదు. డబ్బు సంపాదించేందుకే వస్తున్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంది. 
 
కోర్టులు క్రియాశీలకంగా ఉండాలి
ఓటర్ల హక్కులను పరిరక్షించే విషయంలో న్యాయస్థానాలు క్రియాశీలకంగా పనిచేయాలి. ఓటర్ల తొలగింపుపై ఏదైనా పిల్‌ దాఖలు చేసినప్పుడు.. తొలగింపునకు గురైన వ్యక్తే కోర్టుకు రావాలని న్యాయస్థానాలు అంటున్నాయి. వాస్తవంగా  ఇదెలా సాధ్యం. ప్రతీ వ్యక్తికి కోర్టుకు వచ్చే స్థోమత ఉండదు కదా? ఈ విషయాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. సాంకేతిక అంశాలను, లోపాలను కారణాలుగా చూపుతూ ఓటర్లకు సంబంధించి వ్యాజ్యాలను కొట్టేస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి!! 


ఎన్నికల సంఘం పనితీరు సరిగా లేదు
రాష్ట్రంలో పెద్దఎత్తున ఓటర్ల తొలగింపు జరుగుతుంటే ఎన్నికల సంఘం సరిగా çస్పందించలేదు. ఓటర్లు గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్‌ కేంద్రానికి వెళితే.. ఓటర్ల జాబితాలో పేరు లేదు, ఓటు వేయడం కుదరదంటున్నారు. ఓటర్ల ప్రమేయం లేకుండానే వారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి మాయం అవుతున్నాయి. వీటిపై క్షేత్రస్థాయిలో అధికారులు తగిన విచారణే చేయడం లేదు.  ఒకవేళ ఓటరు జాబితాలో పేరు తొలగిస్తే.. అప్పుడే ఆ వ్యక్తి ఓటరు గుర్తింపు కార్డునూ రద్దు చేయండి. అప్పుడు ఆ వ్యక్తికి తన ఓటు తొలగించినట్లు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన తరువాత గానీ ఓటర్ల జాబితాలో పేరు ఉందో,లేదో తెలియడం లేదంటే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్లు? ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. రాష్ట్రంలో ఈసారి ఓటర్ల సంఖ్య పెరగాలి. కాని అందుకు భిన్నంగా ఓటర్ల సంఖ్య తగ్గింది. ఇది ఎందుకు జరిగిందో ఎన్నికల సంఘం చెప్పగలిగే పరిస్థితిలో ఉందా? 


అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారు
ఇలా అవినీతి ద్వారా వెనకేసుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను ఇష్టమొచ్చినట్లు కొంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆ డబ్బునే ఖర్చుపెడుతున్నారు. ఓటుకు పదివేలు ఇచ్చేందుకు సైతం సిద్ధమంటున్నారంటే.. అవినీతి డబ్బు ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. డబ్బు, ఇతర ప్రలోభాలను ఎర వేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయింపుల విషయంలో మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ను ఓ ఆదర్శ రాష్ట్రంగా మార్చేశారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)