amp pages | Sakshi

సీఎంపై నిప్పులు చెరిగిన  పవన్‌ కల్యాణ్‌  

Published on Tue, 05/29/2018 - 12:11

రాజాం : తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మరా దని, సీఎం చంద్రబాబునాయుడు తన అవసరం వర కూ వినియోగించుకుని, తరువాత తన్ని తోసే సే రకమని జనసేన పార్టీ అధ్యక్షులు కె.పవన్‌కల్యాణ్‌ అన్నారు.  సోమవారం రాజాం పట్టణంలో బస్సు యాత్ర నిర్వహించిన ఆయన అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఒకప్పుడు టీడీపీ ఇదే పవన్‌ కల్యాణ్‌ను వాడుకుం దని, ఆ రోజు హీరో అన్న నేతలు ఈ రోజు ఓట్లు ఎన్ని ఉన్నాయని అడగడం సిగ్గు చేటన్నారు. ఈ ప్రాంతం నుంచి ఓట్లు దండుకున్న అశోక్‌ గజపతి రాజుకు స్థానిక సమస్యలు పట్టడం లేదన్నారు.

దమ్ముంటే టీడీపీ నేతలు ప్రజల్లోకి రావాలని సవాల్‌ విసిరారు. చంద్రబాబువి అధర్మ పో రాటాలని అన్నారు. వాల్తేరు వంతెన కోసం 400 రోజులు దీక్షలు చేపట్టినా స్పందించకపోవడం దారుణమన్నారు. ఉత్తరాంధ్రలో సామాన్యులు అభివృద్ధి చెందలేదని, నేతలు మాత్రం బాగా అభివృద్ధి చెందారని చుర కలు అంటించారు.

వెనుకబాటుకు పాలకులే కారణం

పాలకొండ : శ్రీకాకుళం జిల్లా వెనుకుబాటుకు పా లకుల నిర్లక్ష్యమే కారణమని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. ఆయన సోమవారం పాలకొండలో పోరా ట యాత్ర నిర్వహించారు. ఏలాం కూడలి నుంచి వైఎస్‌ఆర్‌ కూడలి వరకూ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. జంపరకోట రిజర్వాయర్‌ పూర్తి చేయకుండా రైతులను మోసగించారని తెలిపారు.

గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలు తీర్చలేదని, రహదారులు నిర్మించలేదని అన్నారు. నోటిఫైడ్‌ ఏరియాలో లేని గ్రామాల్లో గిరిజనుల అవస్థలు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. ఈ సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల మధ్యకు వస్తే నిలదీయాలన్నారు.  

నిధులు హెరిటేజ్‌ ఖజానాకే  

రణస్థలం : ప్రజలు చెల్లిస్తున్న పన్నులు ఆంధ్రప్రదేశ్‌ ఖజానాకు వెళ్లడం లేదని, హెరిటేజ్‌ ఖజా నాకు దోచిపెడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. సోమవారం మండలం కేంద్రంలోని రామతీర్థాలు కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు ఇసుక మాఫియానే నడుస్తోందన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై 39 సార్లు మాట మార్చారని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా కిడ్నీ సమస్యలతో మరణిస్తుంటే కనీసం డయాలిసిస్‌ సెంటర్‌నైనా ఏర్పాటు చేయలేదన్నారు. కొవ్వాడ అణువిద్యుత్‌ పరిశ్రమ కంటే సులభతమైన విద్యుత్‌ను పెంపొందించవచ్చని చెప్పారు.  

పవన్‌ సభలో యువకునికి తీవ్ర గాయాలు

రాజాం సిటీ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం రాజాంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎం.శంకరరావు అనే యువకుడు గాయాల పాలయ్యాడు. సభ ముగియగానే ఒక్కసారిగా జరిగిన తోపులాటలో యువకుడు కింద పడిపోవడంతో గాయాలపాలైనట్లు తెలిసింది.

శంకరరావును రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్సనందించగా పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం తరలించారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)