amp pages | Sakshi

టీడీపీకి ఓటు వేసి.. మాకిచ్చేయండి

Published on Fri, 03/29/2019 - 12:14

సాక్షి, అమరావతి: ఎన్నికల బందోబస్తుకు వెళ్లే పోలీసులు ముందే పోస్టల్‌ బ్యాలెట్‌ తమకు అప్పగించాలంటూ పలు జిల్లాల్లో డీఎస్పీలు ఒత్తిళ్లు ప్రారంభించారు. చంద్రబాబు కోసం పనిచేస్తున్న కొందరు పోలీస్‌ బాస్‌ల దన్నుతో వారు ఇప్పటికే రంగంలోకి దిగారు. రాష్ట్రమంతటా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బందోబస్తుకు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి ఓట్లు టీడీపీ ఖాతాలో జమ అయ్యేలా పోలీసు బాస్‌లు మౌఖిళ ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రెండు రోజుల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో పోలీసు అధికారులు దృష్టిపెట్టారు. ఎన్నికల సిబ్బంది ఇచ్చే పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకుని టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి వాటిని తమకు అందజేయాలని కోరుతున్నారు. ఇందుకోసం పలువురు డీఎస్పీలు పని గట్టుకుని సీఐ నుంచి కానిస్టేబుల్స్‌ వరకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల్లో బాహాటంగానే టీడీపీకి ఓటు వేయాలనే ఆదేశాలు ఇవ్వడాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది తప్పు బడుతున్నారు. 

మా హక్కును కాలరాస్తున్నారు.. 
 ఓటు హక్కు అనేది రాజ్యాంగం ప్రసాదించిన వరమని, మాకు నచ్చిన వారికి స్వేచ్చగా ఓటు వేసుకునే అధికారాన్ని కూడా బాస్‌లు కాలరాస్తున్నారంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ ఆవేదన వ్యక్తం చేసారు. మా పైఅధికారులే ఇలా చెబితే ఎలా అని, అటువంటప్పుడు మా ఓట్లు కూడా వారే వేసుకునే అధికారం తీసుకోవచ్చు కదా అని గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీఐ ప్రశ్నించారు. పోలీసులుగా సమాజంలో మంచి చెడులు చూస్తామని, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు, మాకు మేలు జరుగుతుందో చూసుకుంటామని, అటువంటి దానికి కీలకంగా ఉండే ఓటు హక్కుపై ఉన్నతాధికారులు నిర్భంధం పెడుతున్నారంటూ చిత్తూరు జిల్లాకు చెందిన ఒక హోంగార్డు వాపోయాడు. రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారుల తీరు మా స్వేచ్ఛను కూడా హరించేలా ఉందని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక కానిస్టేబుల్‌ వాపోయాడు.

ఇలా అనేక మంది పోలీస్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రభుత్వ తీరు, బాస్‌ల వ్యవహారశైలిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై పోలీస్‌ వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను ముందే పసిగట్టిన కొందరు అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసు సంఘాల పేరుతో పలువురు నాయకులు జిల్లాల్లో తిరుగుతూ టీడీపీకి ఓట్లు వేయించేందుకు ఒత్తిడి పెంచారు. మరోవైపు జిల్లాల్లోని పోలీసు అధికారులను ప్రయోగించి వారి వద్ద పనిచేసే దిగువస్థాయి సిబ్బందిపై ఓటు కోసం నిర్భందాలు, ఒత్తిళ్లు, వేధింపులకు దిగడం పట్ల పోలీసు శాఖలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)