amp pages | Sakshi

2,000 నోట్లు బంధీ అయ్యే..!

Published on Sun, 03/17/2019 - 10:46

సాక్షి,  అమరావతి :ఎన్నికలు దగ్గరపడటంతో ప్రజలకు పెద్ద నోట్లు లభించడం లేదు. ఓట్ల కొనుగోలు కోసం రాజకీయ నాయకులు పెద్ద నోట్లను దాచుకోవడమే దీనికి కారణం. ప్రస్తుతం ఏది కొందామన్నా చిల్లర దొరక్క చికాకు పుట్టించే పెద్ద నోట్లు మాయమయ్యాయి. ఏటీఎంల్లో డబ్బులు డ్రా చేస్తుంటే అక్కడ కూడా కేవలం 500, 200, 100 నోట్లే ఉంటున్నాయి. బ్యాంకులు, వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పంపిణీ చేసే నగదు ఒక్కటేమిటి ఎక్కడ వెతికినా చిల్లర నోట్లే దర్శనమిస్తున్నాయి. బ్యాంకులకు రూ.2 వేల నోటు రావటం బాగా తగ్గిపోయిందని, కొంతమంది అవే నోట్లు కావాలని పట్టుబడుతున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. రోజువారీగా బ్యాంకులకు జమయ్యే లావాదేవీల్లో సాధారణంగా వచ్చే పెద్ద నోట్లు బాగా తగ్గిపోయాయని ఓ బ్యాంక్‌ క్యాషీయర్‌ తెలిపారు.  

ముందే దాచుకున్న అధికార పక్షం...
అధికారంలోకి మళ్లీ వచ్చిన అనంతరం ప్రజల నుంచి దోచుకోవచ్చని అధికార తెలుగుదేశం నేతలు ముందు జాగ్రత్తగా పెద్ద నోట్లను దాచుకున్నారని వినిపిస్తోంది. అందులో భాగంగా చిన్న చిన్న పనుల మొదలు పెద్ద కాంట్రాక్టు వరకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు మొత్తం పెద్ద నోట్ల రూపంలో మార్చుకొని చలామణి కాకుండా ఆపేశారు. అధికార పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరు 30 నుంచి
50 కోట్ల వరకు నగదును ఇప్పటికే సిద్ధం చేసుకొని ఉన్నారని సమాచారం. 

వందకు రూ.5 వేల కమీషన్‌
పెద్ద నోట్ల సేకరణ కోసం కమీషన్‌ ఇచ్చే సాంప్రదాయం కూడా రాష్ట్రంలో నడుస్తోంది. వంద రూ.2 వేల నోట్లు ఇచ్చిన వారికి రూ.3 నుంచి రూ.5 వేల వరకు కమీషన్‌ ముట్టుతోందని సమాచారం. రోజువారీ డబ్బులు వసూల్‌ చేసేవారు, కొంత మంది వ్యాపారులు ఈ కమీషన్‌ తీసుకొని పెద్ద నోట్లను రాజకీయ నాయకులకు సరఫరా చేస్తున్నారు. దీంతో దేశంలో చలామణిలో ఉన్న నగదులో దాదాపు 37 శాతం ఉన్న రూ.2 వేల నోటు, 43 శాతం ఉన్న రూ.500 నోట్లకు గిరాకీ పెరిగింది. మరోవైపు కనిపించకుండా పోయిన ఈ నోట్లన్ని ఎన్నికల ముందు రెండు రోజుల నుంచి ఓటర్ల చేతిలో ప్రత్యక్షమవుతాయని ప్రజల్లో చర్చలు కొనసాగుతున్నాయి. నోటుకు కక్కుర్తిపడితే దోపిడీకి గురవుతామని హెచ్చరించుకుంటున్నారు.

- లవకుమార్‌ రెడ్డి,  అమరావతి 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)