amp pages | Sakshi

ఎన్నికల అక్రమాలపై సీ-విజిలెన్స్‌

Published on Sun, 04/07/2019 - 12:06

సాక్షి, తాడికొండ : ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ నాయకులు పలు ఎత్తుగడలు వేస్తారు. ప్రచారం ఊపందుకొన్న నాటి నుంచి ఓటింగ్‌ జరిగేంత వరకు డబ్బు, మద్యం ఎరజూపి ఓటర్లను మభ్య పెడుతుంటారు. అంతటితో ఆగకుండా ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ఎంతటి చర్యలకైనా వెనుకాడకుండా వారిని తమ వైపు తిప్పుకునే యత్నం చేస్తారు.

ఇలాంటి వారి ఆగడాలను అరికట్టి వాళ్లు చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ) సీ–విజిల్‌ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ ద్వారా జరుగుతున్న అక్రమాలను సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రీకరించి  ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే ఎన్నికల కమిషన్‌ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తుంది.

అక్రమాలకు పాల్పడిన వారు తప్పించుకొనే వీలుండదు
సీ–విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడిన వారు తప్పించు కోవటానికి వీలుండదు. ఈ యాప్‌ జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. ఫిర్యాదు ఏ ప్రాంతం నుంచి వచ్చిందో కూడా ఇట్టే తెలిసి పోతుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను ఎన్నికల కమిషన్‌ గోప్యంగా ఉంచుతుంది. గత ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో ఈ యాప్‌ను ఉపయోగించి అధికారులు సత్ఫలితాలు సాధించారు. తెలంగాణ ఎన్నికల్లో దీనిని అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టారు. 

ఫిర్యాదు చేయడం ఇలా..

  • ఆండ్రాయిడ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో గూగూల్‌ ప్లేస్టోర్‌ నుంచి సీ–విజిల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
  • యాప్‌ ఓపెన్‌ చేయగానే వీడియో, ఫొటోలు అనే రెండు ఆప్షన్లు వస్తాయి.
  •  ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో అక్కడ సెల్‌ఫోన్లో నుంచి వీడియోల లేదా ఫొటోలు తీసి యాప్‌ ద్వారా పంపించవచ్చు.
  •  మద్యం, డబ్బుతో పాటు అనుమతి లేకుండా ర్యాలీలు, గోడల మీద రాతలు, జెండాలు పెట్టటం వంటివి ఏవైనా ఫిర్యాదు చేయవచ్చు.
  • ఈ యాప్‌ జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. 
  • ఫిర్యాదు ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకొని జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత ఎన్నికల అధికారి లేక ఫ్లయింగ్‌ స్కాడ్స్‌కు సమాచారం అందిస్తారు.
  •  కేవలం 25 నిమిషాల్లో సంఘటనా స్థలికి చేరుకొని అక్కడ విచారణ చేపడతారు.
  • విచారణ అనంతరం ఫిర్యాదుదారునికి వారు పూర్తి చేసిన కార్యచరణను మెసేజ్‌ రూపంలో అందిస్తారు.
  • ఈ తతంగం అంతా  100నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ఫిర్యాదు చేసివారి పేర్లు ఎక్కడా బహిర్గతం కావు.
  • పౌరులుగా స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవటానికి ఓటరుకు బ్రహ్మాస్త్రం సీ–విజిల్‌. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)