amp pages | Sakshi

ఫార్మాసిటీతో సర్వనాశనం  

Published on Sat, 06/02/2018 - 08:23

యాచారం : తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీని చట్టానికి విరుద్ధంగా ఏర్పాటు చేస్తుంది, నింబంధనలను తుంగలో తొక్కి కాలుష్యంతో  ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుందని కాం గ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో శుక్రవారం ఫార్మా భూబాధితులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

భూసేకరణ చట్టం 2013కు విరుద్ధంగా రైతుల నుంచి భూసేకరణ చేయడమే కాక, రాళ్లు, రప్పల పేరుతో ఇచ్చే పరిహారాన్ని కూడా న్యాయంగా అందజేయలేదన్నారు. చట్టానికి విరుద్ధంగా జరిగిన భూసేకరణ వల్ల కోర్టుల్లో రైతులకే న్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ దృష్ట్యా రైతులు మళ్లీ ఫార్మాకిచ్చిన భూముల్లో సాగు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పట్టాదారు, పాసుపుస్తకంలో ఉన్న ఎకరాలకు న్యాయమైన పరిహారం ఇవ్వకుండా రైతులను నష్టాలకు గురి చేసిందని మండిపడ్డారు.

ఫార్మా పేరుతో రియల్‌ వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం రైతులకు మాత్రం తక్కువ పరిహారం ఇచ్చి వారి జీవోపాధికి కల్పించే సాగు భూములను లాక్కోవాలని చూస్తుందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఆటలు సాగనీవ్వమని హెచ్చరించారు. ఫార్మాసిటీలో వందలాది విష కాలుష్య పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుందన్నారు.  చట్టం రైతులకు అనుకూలంగా ఉంది ఏ మాత్రం భయపడొద్దని సూచించారు.

పలువురు న్యాయవాదులు పాల్గొని చట్టానికి విరుద్ధంగా చేపడుతున్న ఫార్మాసిటీ వల్ల న్యాయస్థానాల్లో ఏ విధంగా అనుకూలమైన తీర్పులు వస్తాయో తెలిపారు.  కార్యక్రమంలో నక్కర్తమేడిపల్లి సర్పంచ్‌ భాషా, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, పర్యావరణవేత్త సరస్వతి , పలు పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?