amp pages | Sakshi

కందుల దిగుమతి నిలిపివేయాలి

Published on Tue, 06/19/2018 - 01:39

సాక్షి, హైదరాబాద్‌ : కందుల దిగుమతి నిలిపివేయా లని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో వివిధ అంశాలపై సమీక్షిం చారు.  కందులను కేంద్రం ఇతర దేశాలనుంచి దిగు మతి చేసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కొన్న కందు లను మార్కెట్లోకి పూర్తిగా విడుదల చేశాకే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని ఆయన ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్క జొన్న, జొన్న వంటి పంటల మద్దతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందన్నారు.

రైతుల నుంచి రూ. 5,618 కోట్ల విలువైన వడ్లను కొనుగోలు చేసి పూర్తిగా చెల్లింపులు చేసినట్లు మంత్రి చెప్పారు. కందులను రూ.1,427 కోట్లతోకొని, రూ.1,420 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. మిగిలిన రూ.7.33 కోట్లు రెండు రోజుల్లో చెల్లించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి శనగలు రూ.294 కోట్లతో కొనుగోలు చేస్తే రూ.265 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. మిగిలిన మొత్తాన్ని రెండు రోజుల్లో రైతులకు చెల్లించాలని నాఫెడ్, మార్క్‌ఫెడ్‌ అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న రూ.629 కోట్లతో రైతుల నుంచి కొనుగోలు చేసి, రూ.611 కోట్లు చెల్లింపులు చేశామని తెలిపారు. మిగిలిన రూ.18 కోట్లు రెండు మూడు రోజుల్లో చెల్లించాలన్నారు. 

జూలై రెండో వారానికి పూర్తిచేయాలి 
ఎస్సారెస్పీ స్టేజ్‌–1 పనులను జూలై రెండో వారానికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయంలో ఎస్సారెస్పీ స్టేజ్‌–1, స్టేజ్‌–2 పనులు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితం అందుకునేది ఎస్సారెస్పీ ప్రాజెక్టేనని మంత్రి చెప్పా రు. సీఎం ఆదేశాల మేరకు రాత్రింబవళ్ళు కష్టపడి పనులు పూర్తి చేయాలన్నారు. పూర్తి ఆయకట్టుకు, ఆయకట్టులోని చివరి పొలాలకు నీరు అందించాలని, ఆ దిశగా ఇంజనీర్లు పని చేయాలన్నారు. ఎస్సారెస్పీ కింద రబీలో ఏప్రిల్, మే నెలలోనూ నీరు ఇవ్వడం వల్ల పనిలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్రిటికల్‌ వర్క్, స్ట్రక్చర్‌ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. కాకతీయ కాలువ పనులు నాణ్యతతో చేయాలన్నారు. షట్టర్స్‌ పనులు,  నాణ్యతను ఈఈలు ఎప్పటికప్పుడు పరిశీలించాల న్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఎన్‌సీలు మురళీధర్, అనిల్‌ కుమార్‌lతదితరులు పాల్గొన్నారు.    

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?