amp pages | Sakshi

మిషన్‌ భగీరథ అతిపెద్ద స్కాం: జీవన్‌రెడ్డి

Published on Sun, 02/04/2018 - 02:48

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న మిషన్‌ భగీరథ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని సీఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.40 వేల కోట్లు మిషన్‌ భగీరథకు వెచ్చిస్తోందని, దీనివల్ల ఒక్కొక్కరిపై రూ.20 వేల భారం పడుతోందని అన్నారు. స్థానికంగా ఫిల్టర్లు, ఆక్వావాటర్, గృహాల్లో ఫిల్టర్లు, నీటి డబ్బాలను తాగునీటి కోసం ప్రజలు వాడుతున్నారని చెప్పారు.

ప్రభుత్వమందించే నీటిని రాబోయే రోజుల్లో బట్టలుతకడానికి, బాత్‌రూమ్, ఇంటి అవసరాలకు వాడుకుంటా రని చెప్పారు. మిషన్‌ భగీరథ నీటిని తాగడానికి వాడుకునే పరిస్థితులే ఉండవన్నారు. ఈ పథకం నీరు తాగడానికి ఉపయోగ పడకపోగా రాష్ట్ర ప్రజలపై అప్పులభారాన్ని పెంచే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటిని అందించకపోగా ఇప్పటికే ఉన్న నీటి సరఫరా వ్యవస్థ, గ్రామాల్లోని రోడ్లను ధ్వంసం చేశారని విమర్శించారు.

ప్రాజెక్టుల తో కుంటలు, చెరువులు నింపాలని, దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ ప్రచార ఆర్భాటం చేసి భగీరథ ద్వారా కేసీఆర్‌ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. మిషన్‌ భగీరథ కాంట్రాక్టు పనులను ఆంధ్రా కాంట్రాక్టర్ల చేతిలో పెట్టి కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. వేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ప్రభుత్వంపై, ఈ పథకంపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.


 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)