amp pages | Sakshi

వారంతా పాక్‌ మద్దతుదారులు: కిషన్‌రెడ్డి

Published on Fri, 12/20/2019 - 18:50

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో జరుగుతున్న ఆందోళనలకు విపక్షాలు బాధ్యత వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. మతపరమైన విద్వేషాలు సృష్టించేందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని విపక్షాలు వాడుకుంటున్నాయని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేవారు పాకిస్తాన్ మద్దతుదారులని విమర్శించారు. పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో వివక్ష ఎదుర్కొంటున్న వారికి భారత్‌లో పౌరసత్వం కల్పిస్తున్నామన్నారు. ఈ మూడు దేశాల్లో ముస్లింలు వివక్ష ఎదుర్కోవడం లేదని, ఈ దేశాల్లో ముస్లిమేతరులే మైనారిటీలుగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఉన్న చొరబాటుదారులను, శరణార్థులను వేరు వేరుగా చూస్తున్నామని, 30-40 సంవత్సరాల క్రితం శరణార్థులుగా వచ్చినవారికే పౌరసత్వం కల్పిస్తున్నామని తెలిపారు. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాగే భారతీయ పౌరులకు ఎటువంటి నష్టం జరగదని ఆయన వివరించారు.

బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలో పౌరసత్వంకు సంబంధించిన అంశం ఉందని, ఎటువంటి ఆలోచన చేయకుండా ఈ చట్టం కార్యరూపం దాల్చలేదని కిషన్‌రెడ్డి వెల్లడించారు. కాగా, శ్రీలంక నుంచి తమిళనాడుకు వలస వచ్చిన తమిళులకు గతంలోనే పౌరసత్వం ఇచ్చామని, ఒకవేళ శ్రీలంక ప్రభుత్వం కోరితే శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాన్ని మతపరంగా చూడొద్దని, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కదిద్దెందుకు రాష్ట్రాలు కోరితే కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. (చదవండి : కేంద్రానికి షాకిచ్చిన నితీష్ కుమార్‌)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌