amp pages | Sakshi

టీడీపీ పునాది కూలిపోయింది

Published on Sun, 11/04/2018 - 05:42

హైదరాబాద్‌: కాంగ్రెస్‌తో చంద్రబాబు కలయికతో తన భర్త స్థాపించిన తెలుగుదేశం పార్టీ పునాది కూలిపోయిందని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తనతో తన భర్త ఎన్టీఆర్‌ చెప్పిన మాటలు నాలుగు పేజీల లేఖ ద్వారా హైదరాబాద్‌లోని ఆయన సమాధి వద్ద ఉంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ భౌతికంగా దూరమైనప్పటి నుంచి అనేక రకాలుగా బాధలు ఎదుర్కొంటూ, అవమానాలు భరిస్తూ తన భర్త ఎడబాటు మోస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌–టీడీపీ కలయికతో ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తుందన్నారు. తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి అఖండ విజయం సాధించారని చెప్పారు. తన భర్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఈ రోజు జరుగుతున్న పరిస్థితి చూసి కన్నీళ్ళు ఆపుకోలేక ఇక్కడకు వచ్చానన్నారు.

1989లో ఓడిపోయినప్పుడు కూడా ఎన్టీఆర్‌ పొత్తులకు వెళ్లలేదని, కాంగ్రెస్‌ పార్టీని ఎదిరించిన మొనగాడిగా చరిత్రలో నిల్చిపోయారన్నారు. అవకాశవాద పొత్తులకు దూరంగా పార్టీని తీర్చిదిద్దారని, 1994లో మళ్లీ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారని చెప్పారు. కానీ ఆయన పక్కనే పెరుగుతున్న విషపు మొక్కను గుర్తించలేక దాని పాలన పడి అధికారాన్ని, పార్టీని కోల్పోయి చివరకు వాళ్ల చేతులతో చెప్పులు కూడా వేయించుకొని అవమాన భారంతో కృంగి, కృశించి అందరికీ దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ చంద్రబాబు చేతిలో స్వార్థానికే అడుకునే బొమ్మలా మారిందని విమర్శించారు. చంద్రబాబు అవకాశవాద పొత్తులతో పార్టీ మూల సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారని, బాబు చేతిలో పార్టీ పూర్తిగా పతనమై అవసాన దశకు చేరుకుందన్నారు.

చంద్రబాబు తప్పులు చేస్తున్నా ఎన్టీఆర్‌ అభిమానులంతా పార్టీకి అండగా నిలబడుతూ వచ్చారని, ఏ సిద్ధాంతం మీద పార్టీని స్థాపించారో ఆ పునాది కూలిపోయిందన్నారు. ఏ ఆత్మగౌరవంతో ఢిల్లీ రాజకీయాల్ని వ్యతిరేకించారో అదే పార్టీకి చంద్రబాబు మోకరిల్లుతున్నారని చెప్పారు. ‘‘స్వామీ మీరు మళ్లీ పుట్టరా, మరలా విలువలతో కూడిన తెలుగువాడి పౌరుషాన్ని ప్రతిభింబించే పార్టీని స్థాపించి ఈ వెన్నుపోటు దారులను, అవినీతి చక్రవర్తులను, స్వార్థంకోసం నీతిని అమ్ముకునే నాయకులను దేశం నుంచి తరిమివేయడానికి మళ్లీ రావాలి’’ అని లక్ష్మీపార్వతి లేఖలో కోరారు. 

Videos

Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ

పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..

చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు

ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన కర్నూలు

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ

కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..

సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు

ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)