amp pages | Sakshi

గుణపాఠం చెప్పారు: అమిత్‌ షా

Published on Mon, 12/18/2017 - 16:55

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఓటర్లును తమ పార్టీపై విశ్వాసం ఉంచారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది కార్యకర్తలు రేయింబవళ్లు శ్రమించడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. ఇది కార్యకర్తల గెలుపుగా ఆయన వర్ణించారు. తమ పార్టీని గెలిపించినందుకు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. గుజరాత్‌లో కులం కార్డుతో గెలవాలనుకున్న కాంగ్రెస్‌ను ఓటర్లు తిరస్కరించారని, హిమాచల్‌ప్రదేశ్‌లో అవినీతిని ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. కుల, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలకు ఈ ఎన్నికలు గుణపాఠం చెప్పాయన్నారు.

కాంగ్రెస్‌తో హోరాహోరీ పోరు జరగలేదని, తాము పూర్తి ఆధిక్యం సాధించామన్నారు. తమకు ఓట్ల శాతం కూడా పెరిగిందని వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామని, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఒక్కో రాష్ట్రాన్ని గెలుస్తూ వస్తున్నామని, నరేంద్ర మోదీ నాయకత్వంలో 19  రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్నామని తెలిపారు. కర్ణాటక సహా రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందని అమిత్‌ షా అన్నారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)