amp pages | Sakshi

‘అంటరానితనం చంద్రబాబు ఒంట్లో ఉంది’

Published on Mon, 02/03/2020 - 15:35

సాక్షి, తాడేపల్లి: ఎంపీ నందిగం సురేష్‌పై పెయిడ్‌ ఆర్టిస్టులతో టీడీపీ దాడి చేయించిందని.. దాడికి చంద్రబాబునాయుడు, లోకేష్‌ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ దిశగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తుంటే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళిత ప్రజా ప్రతినిధులపై దాడులకు ప్రేరేపిస్తున్న చంద్రబాబు, లోకేష్‌పై కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీ సురేష్‌పై వ్యూహం ప్రకారం దాడి చేయించారని నాగార్జున ధ్వజమెత్తారు.

ఎంపీ నందిగం సురేష్‌పై దాడి వెనుక పెద్ద కుట్ర ఉందని.. దాడులతో రాజధానిలో దళితులను మభ్యపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలనలో దళితులు అస్పృశ్యత, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ఎంపీ సురేష్‌పై దాడి చంద్రబాబు అకృత్యాలకు నిదర్శనమని నాగార్జున దుయ్యబట్టారు. దళిత ఎమ్మెల్యేలుపై వరుసుగా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బాపట్ల ఎంపీ సురేశ్‌పై టీడీపీ నేతల దాడి

పామర్రు ఎమ్మెల్యే అనిల్, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు రాజధానిలో రైతులకు ఒక ప్యాకేజీ, దళితులకు ఒక ప్యాకేజీ ఇచ్చి వివక్ష చూపించారని నాగార్జున విరుచుకపడ్డారు. దళితులు కోసం చంద్రబాబు ఒక మంచి పథకమైన పెట్టావా అని ఆయన ప్రశ్నించారు. తన చెంచా మీడియా ద్వారా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని తెలిపారు. అంటరానితనం అనేది చంద్రబాబు ఒంట్లో ఉందని.. దళితులను భయపెట్టడం చంద్రబాబు తరం కాదని  ఆయన అన్నారు. మేము ఉద్యమం చేస్తే చంద్రబాబు, టీడీపీ నేతలు పారిపోతారని ఎమ్మెల్యే మెరుగు నాగార్జున ఎద్దేవా చేశారు.

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)