amp pages | Sakshi

మాకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలి

Published on Thu, 07/26/2018 - 02:15

సాక్షి, సిద్దిపేట: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే విభజన సందర్భంగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ చెప్పినట్టు తెలంగాణకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం సిద్దిపేటలో టీఆర్‌ఎస్వీ జిల్లా శిక్షణతరగతుల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. ఎవరిని అడిగి రాష్ట్ర విభజన చేశారని పార్లమెంట్‌లో టీడీపీ నాయకులు ప్రశ్నించడం శోచనీయమన్నారు. 1956లో ఇక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొనే అప్పటి ప్రధాని నెహ్రూ, తెలం గాణను ఏపీలో కలిపారా? అని ప్రశ్నించారు.

ఇప్పుడు విభజన సందర్భంగా కూడా తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపారని, పోలవరానికి జాతీయ హోదా ప్రకటించిన కాంగ్రెస్‌ తెలంగాణలోని ప్రాణహిత, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణపై విషం కక్కిన చంద్రబాబుతో దోస్తీకి తెలంగాణ కాంగ్రెస్‌ సమాయత్తం కావడం సిగ్గుమాలిన చర్యగా హరీశ్‌ అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడి పరిశ్రమలు తరలిపోతాయని, యువత నిరుద్యోగులుగా మిగులుతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడి అభివృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర పన్నారన్నారు.   

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)