amp pages | Sakshi

కేటీఆర్‌తో సంప్రదింపులు ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసమే

Published on Fri, 01/18/2019 - 02:56

నగరి/వేంపల్లె: కేటీఆర్‌తో సంప్రదింపులు ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసమే అని ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అలాగే వైఎస్సార్‌ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిలోని ఆంజనేయస్వామిని దర్శింకున్న అనంతరం ఆమె వేంపల్లెలో విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్‌తో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన సంప్రదింపులపై టీడీపీ నాయకులు చేసిన విమర్శలపై ఆమె విరుచుకుపడ్డారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు టీడీపీ వారికి ఎప్పుడూ ఎవరితో పొత్తు పెట్టుకుంటాం, ఎవరిని ఏమార్చి అధికారం చేజిక్కించుకోవాలన్న ఆలోచనే ఉంటుందని ధ్వజమెత్తారు.

అందుకే జగనన్న ఎవరితో మాట్లాడినా వారికి పొత్తు ఆలోచనే వస్తుందన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు జగనన్న చేసేది ప్రతిదీ తప్పు అని చెప్పడమే అలవాటుగా పెట్టుకున్నారన్నారు. 40 యేళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పగా చెప్పుకునే ఆయనకు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎందుకు పెడతారో తెలియదా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ దేశానికి అన్యాయం చేసిన పార్టీలని వాటిపై పోరాడేందుకు ఫెడరల్‌ ఫ్రంట్‌ పెట్టడంలో తప్పేంటన్నారు. విశ్వసనీయత, భావసారూప్యత ఉన్న పార్టీలు కలిసి పనిచేయడం ఎక్కడైనా జరుగుతుందని అందుకే పార్టీ అధ్యక్షుని హోదాలో జగన్‌మోహన్‌ రెడ్డిని కేటీఆర్‌ కలిసారన్నారు.

దీనికి టీడీపీ నాయకులు పెడర్దాలు తీస్తున్నారన్నారు. వారు కలిస్తే పచ్చ నేతలకు వణుకెందుకు పుడుతోందన్నారు. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్, కేటీఆర్‌లు పిలవడమే కాకుండా శిలాఫలకంపై పేరును చెక్కించడం మీరంతా ఆ రోజు ప్రశ్నించకుండా గాడిదలు కాస్తున్నారా అని ధ్వజమెత్తారు. రామోజీరావును కలిసినప్పుడూ ఇలాగే రాద్ధాంతం చేశారన్నారు. ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్‌ కాళ్లు పట్టుకొని దొంగలా విజయవాడకు పారిపోయింది ఎవరో ప్రజలందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు వియ్యంకుడు కేటీఆర్‌ను కలవచ్చు, అందరికీ నీతులు చెప్పే పవన్‌ కళ్యాణ్‌ కలిస్తే తప్పులేదు.. జగనన్న కలిస్తే తప్పొచ్చిందా అన్నారు.

తెలంగాణలో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించింది మీరుకాదా అని ప్రశ్నించారు. హరికృష్ణ మృతదేహం వద్ద కూడా రాజకీయం చేశారని, కేసీఆర్‌ ఛీ పొమ్మంటే కాంగ్రెస్‌ పార్టీతో కలిసారన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి దమ్ము గురించి టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన దమ్ము, సత్తా ఏంటో మీకు, సోనియాగాంధీకి తెలుసు అన్నారు.   ఓటమి భయం పట్టుకున్న చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామిలు అమలు చేయకపోతే టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌