amp pages | Sakshi

భూ కబ్జాలకు తెగబడుతున్న టీడీపీ నేతలు

Published on Wed, 05/23/2018 - 04:24

సాక్షి, అమరావతి/కాశీబుగ్గ: తెలుగుదేశం పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇదే పనిగా పెట్టుకున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మూడో రోజైన మంగళవారం పలాస–కాశీబుగ్గ పట్టణంలో పవన్‌కల్యాణ్‌ రోడ్‌షో నిర్వహించారు. అంతకముందు హరిశంకర్‌ థియేటర్‌ వద్ద కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నారని, వారు ఏమి చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యలను తమ పార్టీ వెలుగులోకి తెచ్చేవరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు మొద్దునిద్ర పోయారని విమర్శించారు.

సీపీఎస్‌ విధానాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి  స్పందించడం లేదన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో భృతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. పార్టీ నాయకులు డాక్టర్‌ దుర్గారావు, మున్సిపల్‌ చైర్మన్‌ కోత పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ 45 రోజులు పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఆయనకు తగిన భద్రత కల్పించాలంటూ జనసేన పార్టీ నేతలు బుధవారం డీజేపీని కలవనున్నారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ కన్వీనర్‌ రాఘవయ్య ఆధ్వర్యంలో జనసేన బృందం ఉదయం 11 గంటలకు మంగళగిరిలో డీజీపీ మాలకొండయ్యను కలవనున్నట్టు పేర్కొన్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)