amp pages | Sakshi

రజనీకాంత్..‌! ఎవరు నువ్వు?

Published on Fri, 06/01/2018 - 14:32

సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన అమానుష పోలీసు కాల్పులపై రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడు రజనీకాంత్‌ మాట మార్చి ప్రజల ముందు, ముఖ్యంగా సోషల్‌ మీడియాలో అభాసు పాలయ్యారు. పోలీసుల కాల్పుల సంఘటన జరిగిన మే 22వ తేదీన వారి అమానుషత్వాన్ని విమర్శిస్తూ రజనీకాంత్‌ ఓ చిన్న వీడియాను విడుదల చేశారు.

పోలీసు కాల్పుల్లో గాయపడి తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి ఆయన బుధవారం అక్కడికి వెళ్లినప్పుడు ఓ బాధితుడి నుంచి ఆయనకు ఊహించని ప్రశ్న ఎదురయింది. ‘ఎవరు నువ్వు?’ అన్నదే ఆ ప్రశ్న. దీంతో కంగుతిన్న రజనీకాంత్, అక్కడ తన పేరు చెప్పుకొని త్వరత్వరగా పరామర్శ కార్యక్రమాన్ని ముగించుకొని ఆస్పత్రి బయటకు వచ్చారు.
 
‘సంఘ వ్యతిరేక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు నిరసనలో పాల్గొన్నారు. వారు పోలీసులపై రాళ్లు రువ్వడం వల్ల పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది’ అని రజనీకాంత్‌ తన అంతుకుముందటి వైఖరి మార్చుకొని మీడియా ముందు వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన పాలనలో ఇలాంటి శక్తులు తలెత్తకుండా చేశారని, ఆమె తరహాలో ప్రస్తుత ఏఐఏడిఎంకే ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. 

నిరసన ప్రదర్శనలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నారన్న విషయం తమకు ఎలా తెలుసు, ఎలా ధ్రువీకరించుకున్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు తడబడిన ఆయన ‘ఆ...నాకు తెలుసు’ అంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇలా మాట మార్చడంపై సోషల్‌ మీడియాలో రజనీకాంత్‌కు వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘పక్కా బీజేపీ తొత్తువి’, ‘ఏలియన్‌ హిందూత్వ’ అంటూ ట్వీట్లు పేలాయి. 

వేదాంత గ్రూప్‌నకు చెందిన తూత్తుకుడి స్టెరిలైట్‌ కాపర్‌ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో టెర్రరిస్టులు, నక్సలైట్లు పాల్గొన్నారని బీజేపీ నాయకులు విమర్శించడం తెల్సిందే. మోదీకి, బీజేపీకి వేదాంత గ్రూప్‌ ఇష్టమైన సంస్థ అవడమే వారి విమర్శలకు కారణం ఏమో! అయినా మాట మార్చడం రజనీకాంత్‌కు కొత్త కాదు. జయలలిత తుదిశ్వాస వరకు ఆమెను నిజమైన ‘అమ్మ’ అంటూ ప్రశంసించిన ఆయన 1996లో జయలలితకు ఓటు వేయరాదంటూ తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె గనుక గెలిస్తే తమిళనాడు రాష్ట్రాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేరంటూ విమర్శించారు. 

రీల్‌ హీరోగా, రియల్‌ హీరోగా వేరు
చాలా మందిలాగానే సినిమాలో హీరోగా కనిపించే రజనీకాంత్‌ వేరు. నిజ జీవితంలో రజనీ వేరు. జూన్‌ ఏడవ తేదీన విడుదలవుతున్న ‘కాలా’ చిత్రంలో రజనీ ప్రజల నిరసన ప్రదర్శనలను ప్రోత్సహిస్తారు. పేద వారి శరీరాలే ఆయుధాలంటారు. తూత్తుకుడిలో ప్రదర్శన జరిపిన ప్రజలనేమో సంఘ విద్రోహశక్తులన్నారు. ‘ఎవరు నువ్వు’ అంటూ ఓ బాధితుడు అన్నందుకు కోపం వచ్చి రజనీకాంత్‌ మాటమార్చారని అనుకోరాదు. 

ఒకవేళ అదే కారణం అయితే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న ఆయన ఇక రాణించలేరు. అరాచకవాదులు, తీవ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు తూత్తుకుడి ప్రదర్శనలో ఉన్నారని రజనీకాంత్‌ అత్యంత సన్నిహితుడు, ఆరెస్సెస్‌ సభ్యుడు, తుగ్లక్‌ మాగజైన్‌ ఎడిటర్‌ ఎస్‌. గురుమూర్తి ఆరోపించారు. రజనీ కూడా సంఘ విద్రోహ శక్తులంటూ మాట మార్చడంతో ఆయన ట్వీట్ల మీద ట్వీట్లతో రజనీకాంత్‌ను ప్రశంసించారు.

‘ఎవరు నువ్వు?’ అంటూ బాధితుడు వేసిన ప్రశ్న రజనీకాంత్‌కు సరిగ్గా అర్థం కానట్లు ఉంది. తనదీ ఆద్యాత్మిక రాజకీయమంటూ చెప్పుకుంటున్న రజనీకాంత్‌ ఎవరి పక్షమని, ఏ పార్టీ పక్షం అన్నదే ప్రశ్న. ఆధ్యాత్మికమంటే హిందూత్వమనేదే అర్థమని, రజనీకాంత్‌ బీజేపీ పక్షమంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ఒప్పుకోవాలన్నదే బాధితుడి ప్రశ్న. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)