amp pages | Sakshi

అత్యంత ధనిక పార్టీ ఎవరిదో తెలుసా?

Published on Fri, 03/09/2018 - 16:37

సాక్షి, న్యూఢిల్లీ : అధికారాన్ని కోల్పోయిన ఉత్తరప్రదేశ్‌లోని అఖిలేశ్‌ యాదవ్‌కు చెందిన సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పీ) మరోసారి వార్తల్లో నిలిచింది. దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ధనికమైన పార్టీగా నిలిచింది. రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన డీఎంకే ఆతర్వాత అన్నాడీఎంకే నిలిచాయి. ఢిల్లీకి చెందిన అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే సంస్థ వెల్లడించిన ప్రకారం ఎస్‌పీ 2015-16కు తన ఆస్తులు రూ.634.96కోట్లుగా వెల్లడించింది. ఇది 2011-12లో రూ.212.86కోట్లు కాగా అవి తాజాగా 198శాతానికి పెరిగాయి.

ఇక డీఎంకే ఆస్తులు రూ.257.18(2015-16), అన్నాడీఎంకే రూ.224.84 కోట్లు (2015-16) ఇవి 2011-12తో పోలిస్తే 155శాతం అధికం. స్థిరాస్తులు, చరాస్తులు, లోన్లు, అడ్వాన్స్‌లు, డిపాజిట్లు, పెట్టుబడులు ఇతర ఆస్తులన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఏడీఆర్‌ ఈ నివేదిక వెల్లడించింది. మొత్తం 20 ప్రాంతీయ పార్టీల ఆస్తుల వివరాలను పేర్కొంది. అందులో తెలుగు ప్రాంతాలకు చెందిన పార్టీలను పరిశీలిస్తే మార్చి 2011లో నమోదైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 2012-13కు గాను తన ఆస్తులు రూ.1.165కోట్లు అని వెల్లడించిందని, 2015-16 రూ.3.765కోట్లు అని పేర్కొందని నివేదిక తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) తెలుగు దేశం పార్టీ (టీడీపీ) 2015-16కుగానూ వరుసగా రూ.15.97 కోట్లు అని టీడీపీ మాత్రం రూ.8.186 కోట్లు అని వెల్లడించినట్లు ఏడీఆర్‌ వెల్లడించింది.

Videos

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?