amp pages | Sakshi

అభ్యర్థులకు భద్రత

Published on Mon, 11/12/2018 - 03:25

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు భద్రత కల్పించేందుకు ఎన్నికల కమిష న్‌ పోలీస్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. సోమవారం నుంచి నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుండటం, ప్రచార ప్రక్రియ కూడా జోరందుకోవడంతో అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. ప్రచారంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించడం, బహిరంగసభల్లో పాల్గొనడం, సున్నితమైన ప్రాంతాల్లోనూ పర్యటిం చాల్సిన పరిస్థితులుండటంతో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈసీ చర్యలు చేపట్టాల్సి ఉంటుం ది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు ప్రముఖులైన అభ్యర్థులకు కూడా పోలీస్‌ భద్రత కల్పించాలని ఆదేశించినట్టు తెలిసింది.

ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు 2+2 గన్‌మెన్ల చొప్పున రక్షణ కల్పించడంతో పాటు, మాజీ మంత్రులు, గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచి ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తు న్నవారికి సైతం 1+1 గన్‌మెన్ల కేటాయింపులపై ఎన్నికల కమిషన్‌ పోలీస్‌శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయా జిల్లాల ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) హెడ్‌క్వార్టర్‌ నుంచి గన్‌మెన్లను కేటా యిస్తారు. తాజా మాజీ మంత్రుల వద్ద ఉన్న ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ సిబ్బందిని కొనసాగించేందుకు కూడా అవకాశం ఉన్నట్టు తెలిసింది. వారికి జిల్లా ఏఆర్‌ సిబ్బందిని కూడా నియమించనున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి.

గన్‌మెన్లుగా 1,500 మంది సిబ్బంది..
ప్రతీ నియోజకవర్గంలో 5 ప్రధాన పార్టీల అభ్యర్థుల తో పాటు మరో ఇద్దరు లేదా ముగ్గురు గుర్తింపు పొం దిన రాజకీయ నేతలు పోటీలో ఉండే అవకాశం ఉన్న ట్టు నిఘా వర్గాలు ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చా యి. 119 నియోజకవర్గాల్లో 750 మంది నుంచి 800 మంది పోటీ చేసే అభ్యర్థులుంటారని అంచనా. వీరి భద్రత నిమిత్తం 1,500 మంది సిబ్బందిని గన్‌మెన్లుగా నియమించనున్నట్టు తెలిసింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)