amp pages | Sakshi

మెరుపులా వచ్చి మాయమవుతున్న సినీ స్టార్లు..

Published on Thu, 03/28/2019 - 10:09

వెండితెరపై అలవోకగా సాహసకృత్యాలను పండించే నటీనటులు నిజజీవిత రాజకీయాల్లోను, ఎన్నికల్లోను కూడా అదే హవా కొనసాగించాలని రావడం, వారిలో కొందరంటే కొందరే ప్రజామోదం పొందడం జరుగుతోంది. ఎక్కువమంది నటీనటులు పెద్ద ప్రభావం చూపకుండానే రాజకీయాలను చాలించుకోవడం విశేషం.  

సాక్షి, బెంగళూరు:  ఎన్నికలు వస్తే చాలు రాష్ట్ర రాజకీయా ల్లో సినీ స్టార్లు తళుక్కున మెరుస్తుండడం సహజం. కానీ అలా రాజకీయాల్లోకి మెరుపులా వచ్చి మాయమవుతున్నవారే అధికంగా ఉన్నారు. బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌ కొన్ని నెలలుగా బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శల యుద్ధం ప్రారంభించి తాజాగా బెంగళూరు సెంట్రల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గతంలో కూడా ఇక్కడ పలువురు ఐటీ, పారిశ్రామిక ప్రముఖులు పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ప్రకాశ్‌ రాజ్‌ భవితవ్యం ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా లేక చాలా మందిలా మళ్లీ సినిమాలకు వెళ్లిపోతారా? అని కొందరు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.

ఊరించిన ఉపేంద్ర 
ఇక శాండల్‌వుడ్‌లో విలక్షణ నటుడు ఉపేంద్ర రాజకీయాల్లో రియల్‌స్టార్‌లా సత్తా చూపలేకపోతున్నారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలిపారు. వీరిలో ఎక్కువమంది పెద్దగా ఊరూపేరు లేనివారే. దీంతో ఎన్నికలపై ప్రభావం చూపలేకపోతున్నారని చెప్పాలి.

 మండ్యలో వార్‌  
ఇక ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం మండ్య నియోజకవర్గమనే చెప్పాలి. రెబెల్‌స్టార్‌ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తుండడం, ఆమెకు బీజేపీ మద్దతిస్తుండడం సంచలనంగా మారింది. ఆమె పోటీదారు, జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ కూడా వర్ధమాన హీరోనే. ప్రచారంలో హోరాహోరీగా తలపడుతున్నారు.
 

  • వీరితో పాటు చాలా మంది గతంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వెండితెరపై మెరిసిన చాలా మంది రాజకీయాల్లో హిట్లు కొట్టలేకపోయారు.  
  • అంబరీశ్‌ రాజకీయాల్లో విజయం సాధించారు. అంబరీశ్‌ కేంద్రం,రాష్ట్రంలో మంత్రిగా పనిచేశా రు .అంతేకాకుండా పలుమార్లుఎన్నికల్లో గెలిచారు.  
  • ప్రముఖ నటి రక్షిత బీఎస్‌ఆర్‌ పార్టీలో చేరారు. తరువాత రాజకీయాల్లో కనిపించలేదు.   
  • పూజాగాంధీ జేడీఎస్‌ పార్టీలో చేరి కొద్దిరోజులు హల్‌చల్‌ చేశారు. పలు ఎన్నికల్లో ప్రచారం చేసినా తరువాత రాజకీయాల నుంచి దాదాపు దూరమయ్యారు.  
  • నటులు శ్రీనాథ్, జగ్గేశ్, చంద్రు, తారా, శ్రుతి, మాళవిక వంటివారు బీజేపీలో తగిన స్థాయిలో పేరు తెచ్చుకున్నారు.  
  • ఉమాశ్రీ, జయమాల వంటి వారు ఇప్పటికీ విజయాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు.  
  • శాండల్‌వుడ్‌ సీనియర్‌ నటుడు అనంత్‌నాగ్‌ గతంలో జేహెచ్‌ పటేల్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా జేహెచ్‌ పటేల్, రామక్రిష్ణ హెగ్డే వంటి ముఖ్యమంత్రులతో సన్నిహితుడిగా పేరుపొందారు.  
  • మండ్య మాజీ ఎంపీ రమ్య కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోషల్‌ మీడియా విభాగం చీఫ్‌గా ట్విట్టర్‌లో కాక పుట్టిస్తుంటారు.  
  • చిత్రదుర్గ మాజీ ఎంపీ శశికుమార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వద్ద పనిచేస్తూ కొనసాగుతున్నారు.  
  • కొన్ని సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించిన ఎమ్మెల్యే ఇప్పుడు బీసీ పాటిల్‌ మంత్రి పదవి కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు.  
  • స్టార్‌ హీరోలు యశ్, దర్శన్‌ ఈ ఎన్నికల్లో సుమలత తరఫున మండ్యలో జేడీఎస్, కాంగ్రెస్‌లను ఢీకొంటున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)