amp pages | Sakshi

ఎలాంటి పోరాటానికైనా సిద్ధం

Published on Thu, 05/14/2020 - 02:35

సాక్షి, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు అంశం తెలంగాణకు జీవన్మరణ సమస్య అని, దీనిపై ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమేనని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 3 టీఎంసీల నీటిని తరలిస్తూ అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. దీక్షలో కాంగ్రెస్‌ నేతలు నల్ల రిబ్బన్లు కటు ్టకుని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, కాంగ్రెస్‌ తరఫున ప్రధాని మోదీని కలుస్తామన్నారు. కేసీఆర్‌ చేతకానితనం వల్లే పరిస్థితి  వచ్చిందని, పోతిరెడ్డిపాడు పనులు ప్రారంభమైన రోజే సీఎం కేసీఆర్‌ రాజీనామా చే యాలన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దక్షిణ తెలంగాణ జిల్లాలు నష్టపోతాయన్నారు. ఈ జీవోపై కోర్టులను ఆశ్రయిస్తామని, సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. పోతిరెడ్డిపాడుపై అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గేంత వరకు తమ పోరుసాగుతుందని, అవసరమైతే ‘చలో పోతిరెడ్డిపాడు’కు పిలుపునిచ్చేందుకూవెనుకాడబోమన్నారు.దీక్షలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, వీహెచ్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Videos

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?