amp pages | Sakshi

‘ఆయన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి’

Published on Mon, 04/13/2020 - 14:07

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వ్యాపిస్తున్న కరోనాను ఐక్యమత్యంతో ఎదుర్కోవాల్సిన సమయంలో దేవినేని ఉమా రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మైలవరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సంత కృష్ణ ప్రసాద్‌ విమర్శించారు. సోమవారం ఎమ్మెల్యే తాడేపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్రం విపత్తులో ఉన్న సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటుంటే టీడీపీ నేతలు ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ రోజు అయినా ఉమా ప్రజలు గురించి ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. (టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగించొద్దు.. )

టీడీపీ నేతలు ప్రజలను కరోనాపై భయాందోళనకు గురిచేస్తున్నారని, ప్రజలకు కావాల్సింది విమర్శలు కాదు భరోసా అని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కరోనా పోరాటంలో కలిసి రాకపోగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, ప్రజలకు ధైర్యం చెప్పకపోగా వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పదవి పోయి దేవినేని ఉమాకు పిచ్చి పట్టిందని ఎద్దేవా చేశారు. మంత్రిగా ఉమా జిల్లాకు ఏం చేశారని నిలదీశారు. కొడాలి నాని గురించి మాట్లాడుతున్న ఉమాకు ఏ అర్హత ఉందని ఇరిగేషన్‌ మంత్రి చేశారని ప్రశ్నించారు. (మీరెవరో మీకైనా తెలుసా: ప్రధానిపై ఫైర్‌! )

‘మరొక ఏడాదిలో మళ్ళీ నేను మంత్రి అవుతానని దేవినేని ఉమా అందరికి చెపుతున్నాడంటా. ఆయనను పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలి. దేవినేని నెహ్రూ ఇంట్లో కాపీలు మోసుకుంటూ పీఏ గా పని చేసిన వ్యక్తి ఉమా. మంగళగిరి పేరు పలకని వ్యక్తి లోకేష్ను ఐటీ మంత్రిగా చంద్రబాబు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడాలనేది టీడీపీ ఉద్దేశ్యం. ప్రజలు ఇబ్బంది పడితే రాజకీయాలు చేయాలన్నదే టీడీపీ లక్ష్యం. కరోనా విషయంలో సీఎం జగన్  సూచనలను ప్రధాని మోదీ పరిగణలోకి తీసుకొనే అవకాశం ఉంది’. అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ పేర్కొన్నారు. (‘దేవినేని ఉమాకు మతి భ్రమించింది’)

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?