amp pages | Sakshi

మీరు 40 ఏళ్లలో ఇలాంటి పనులు చేశారా?

Published on Wed, 11/20/2019 - 12:50

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇతర రాష్ట్రాలలో సైతం ఆరోగ్యశ్రీని అమలు చేసేలా చర్యలు చేపట్టారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 51 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీని ప్రవేశ పెట్టారని ప్రస్తావించారు. గత పాలనలో చంద్రబాబు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి అందులో కొన్ని వ్యాధులను తొలగించారని విమర్శించారు. సీఎం జగన్‌.. తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో తాము పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా మద్యపానం నుంచి ఆదాయం పోతున్నా.. ముఖ్యమంత్రి దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ పాలన చేపట్టి అయిదు నెలలు కాకముందే ప్రతిపక్షనేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు చేయలేని పనిని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు నెలల్లో చేసి చూపారని, చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టరా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడమే కాకుండా లబ్ధిదారులకు అందేలా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా చర్యలు చేపట్టామని వివరించారు. రానున్న ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు అందిస్తామని, జనవరి నుంచి అమ్మఒడి పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. 

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)