amp pages | Sakshi

‘రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ దుష్ప్రచారం’

Published on Fri, 01/18/2019 - 13:00

సాక్షి, కర్నూలు : తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే.. టీడీపీ నేతలు షర్మిలపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు మహిళా విభాగం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. జగనన్న పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ చూసే టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటువంటి చర్యలను వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మహిళల్లో చైతన్యం తీసుకువస్తామని పేర్కొన్నారు.

ఆ నీచ సంస్కృతి మాకు లేదు
నంద్యాల : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎంత వరకైనా వెళ్తారని వైఎస్సార్‌ సీపీ నంద్యాల సమన్వయ కర్త శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చించేందుకు కేటీఆర్-  వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి కలవడాన్ని టీడీపీ నేతలు విమర్శించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిలా స్వప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు చేసే నీచ సంస్కృతి తమ పార్టీ అధ్యక్షుడికి లేదని పేర్కొన్నారు. ఇకనైనా తెలుగుదేశం పార్టీ నాయకులు దృష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.

Videos

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

Photos

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)