amp pages | Sakshi

‘కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు’

Published on Sat, 10/27/2018 - 16:18

సాక్షి, కర్నూలు : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై దాడి ఘటనపై టీడీపీ నాయకులు స్పందించిన తీరు బాధాకరమని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతినేతపై జరిగిన దాడిని ఖండించకపోగా కనీసం సానుభూతి కూడా తెలుపకుండా ముఖ్యమంత్రి, టీడీపీ మంత్రులు మానవ మృగాలుగా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలను చంద్రబాబు రాజకీయ శిఖండులుగా మార్చుకున్నారని విమర్శించారు.

చంద్రబాబుకు అమ్ముడు పోయి, పార్టీ మారిన ఫిరాయింపుదారులు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సానుభూతి కోసమే వైఎస్‌ జగన్‌ దాడి చేయించుకున్నారని మాట్లాడటం వారి దగా కోరు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. వైఎస్‌ జగన్‌ పేరు ఎత్తే అర్హత కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు లేదన్నారు. కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ప్రజల్లో వైఎస్‌ జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకనే దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీ హత్యా రాజకీయాలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పై జరిగిన దాడి ఘటననే పరాకాష్ట అన్నారు. సొంత మామను, పార్టీ నాయకులను అడ్డుతొలగించుకున్న చంద్రబాబు, రాజకీయ ప్రత్యర్థులను అంతం చేయడానికి రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేవుని దయ, ప్రజల దీవెనల వల్లే వైఎస్‌ జగన్‌కు ప్రాణాపాయం తప్పిందని రామయ్య పేర్కొన్నారు.

Videos

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు

చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్

పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

Photos

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)