amp pages | Sakshi

చంద్రబాబు దరిద్రపు ఆలోచన వల్లే...

Published on Sat, 12/02/2017 - 01:49

సాక్షి, హైదరాబాద్‌ : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. మూడున్నరేళ్ల తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ బాధ్యత నుంచి తప్పుకోవడానికి కుంటిసాకులు వెతకడం దారుణమని వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జీవనాడి అని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు.

చంద్రబాబు దరిద్రపు ఆలోచన వల్లే...
పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరుగారుస్తున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై సాకులు చూపిస్తూ...రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టిపరిస్థితిలో పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ప్రత్యేక హోదాను తుంగలో తొక్కి...పోలవరం పనులను చంద్రబాబు చేజిక్కించుకున్నారని మండిపడ్డారు. ‘పోలవరాన్ని కేంద్రమే చేపడుతుందని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉంది. ఎందుకో కానీ చంద్రబాబు ఆ ప్రాజెక్ట్‌ పనులను చేపట్టారు.

2018లో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని గతంలో చెప్పారు. ఇప్పుడేమో కేంద్రంపై నిందలు వేస్తున్నారు. కేంద్రం బాధ్యతను చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు. చంద్రబాబు దరిద్రపు ఆలోచన వల్లే ఏపీ నష్టపోతోంది. పోలవరం పూర్తి కాకపోతే రాష్ట్ర ప్రగతి దెబ్బతింటుంది. పోలవరంపై కుంటిసాకులు చెప్పి ప్రజలను మోసం చేయడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం బాధ్యత నెరవేర్చకపోతే చంద్రబాబు క్షమార్హులు కారు. రాష్ట్ర ప్రజల జీవితాలతో చంద్రబాబు ఆడుకోవద్దు.’ అని వ్యాఖ్యలు చేశారు.

ఆ బాధ్యత చంద్రబాబుదే...
పోలవరం బాధ్యత నుంచి తప్పించుకోటానికి చంద్రబాబు దారులు వెతకడం దారుణమని వైఎస్‌ఆర్‌ సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఇన్ని రోజులు గొప్పలు చెప్పి... ఇప్పుడెందుకు చేతులు ఎత్తేస్తున్నారని ప్రశ్నించారు. ఎస్టిమేట్లపై కేంద్రం వివరణఅడిగితే..వారిపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.  ఇన్ని రోజులు కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదని నిలదీశారు. శ్వేతపత్రం విడుదల చేయాలని ఎన్నిసార్లు అడిగినా...పట్టించుకోలేదని ఉమారెడ్డి మండిపడ్డారు. ‘ఎమ్మెల్యేలను వారం క్రితం పోలవరం తీసుకు వెళ్లి భ్రమలు సృష్టించారు. వారం రోజుల్లోనే ఎందుకు మాట మార్చారు. గతంలో పనుల తీరును తప్పుబడితే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇన్నిరోజులు గొప్పలు చెప్పి ఇప్పుడెందుకు చేతులు ఎత్తేస్తున్నారు. ఆ రోజు ప్రాజెక్ట్‌ను తీసుకోమని కేంద్రం అడిగిందా?. చంద్రబాబు అడిగితేనే ప్రాజెక్ట్‌ను ఇచ్చామని ఆర్థికమంత్రి  అరుణ్‌ జైట్లీ స్వయంగా చెప్పారు.

ఇన్నాళ్లు ప్రతిపక్షాన్ని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్షం సహకరిస్తే కేంద్రం వద్దకు తీసుకు వెళతామని అంటున్నారు. అసలు ఢిల్లీకి రామని ఎప్పుడైనా మేం అన్నామా? మేం అందులోని లొసుగులు మాత్రమే ప్రశ్నిస్తూ వచ్చాం. శ్వేతపత్రం విడుదల చేయాలని అనేకసార్లు అడిగాం. మా డిమాండ్‌ను ఎప్పుడు పట్టించుకోలేదు. ఇన్నిరోజుల ఆ ప్రాజెక్ట్‌ నాదే అని, ఇప్పుడు చేతలు కాలాక ఆకులు పట్టుకుంటారా?. పోలవరంపై మొదటి నుంచి చంద్రబాబుది తప్పుడు దారే. ఎప్పుడు ఎవరినీ సంప్రదించలేదు. జాతీయ ప్రాజెక్ట్‌ను మీరు చేస్తామని ఎందుకు అంగీకరించారు. ఇన్నిరోజులు కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదు. లొసుగులన్నీ మీ దగ్గర పెట్టుకుని పోలవరాన్ని గంగలో కలిపితే ప్రజలు మిమ్మల్ని క్షమించరు.’ అని అన్నారు.

ఇన్నాళ్లు రాజకీయాలు చేసి...
పోలవరం పనులను చంద్రబాబు నాయుడు చట్టవిరుద్ధంగా చేపట్టారని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘కమీషన్ల కోసమే ఇన్నాళ్లు పనులు ఇన్నాళ్లు పనులు చేశారు. స్వార్థపు ఆలోచన, కమీషన్ల కక్కుర్తే పోలవరానికి అడ్డంకిగా మారింది. ఇన్నాళ్లు రాజకీయాలు చేసి...ఇప్పుడు రాజకీయాలు చేయనని చెబుతారా?. చట్టంలో ఉన్న పోలవరం ఎందుకు పూర్తి కావడం లేదో.. చంద్రబబు, టీడీపీ నేతలు చెప్పాలి. లేకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. విభజన చట్టం ప్రకారం ఏపీకి పోలవరం రావాలి. నిర్ణీత సమయంలోనే ప్రాజెక్ట్‌ పూర్తి కావాలి. రాష్ట్రం సస్యశ్యామలం కావాలి.

Videos

Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ

నేనంటే భయమెందుకు బాబు

జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు

పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..

లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్

చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..

ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు

సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)