amp pages | Sakshi

భారత క్రికెటర్ ను పొగిడినా తప్పని తిప్పలు!

Published on Tue, 09/26/2017 - 11:22

కోల్ కతా: భారత్ తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఓటమిని జీర్ణించుకోలేని ఆ దేశ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత డీన్ జోన్స్.. భారత్ గెలుపుకు వర్షమే కారణమని వ్యాఖ్యానించి నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. భారత జట్టు విజయం సాధించాలంటే వర్షం పడాలేమో అని వ్యాఖ్యానించాడు. దాంతో భారత అభిమానులు జోన్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీకేమైనా బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆసీస్ క్రికెట్ జట్టు తొండాటను ఆడటంలో ఎప్పుడూ ముందుంటుందని, దానికి ఆ దేశ మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తారనడానికి ఇదే నిదర్శమని విమర్శల వర్షం కురిసింది.

అయితే మూడో వన్డేలో భారత విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న తరువాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కొనియాడిన జోన్స్ విమర్శలకు గురయ్యాడు. హార్దిక్ బౌలింగ్ యాక్షన్ అచ్చం వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ లా ఉందంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక్కడ స్పీడ్ సంగతిని పక్కన పెడితే  హోల్డింగ్ తరహాలోనే పాండ్యా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. కాగా, డీన్ జోన్స్ తాజా వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

పాండ్యాలాంటి సాధారణ బౌలర్ ని దిగ్గజ బౌలర్ హోల్డింగ్ తో ఎలా పోల్చావంటూ ఒక అభిమాని విమర్శించగా, నువ్వొక పెద్ద క్రికెట్ అభిమానిలా కనబడతావ్. కానీ క్రికెటర్లను ఎలా పోల్చాలి అనేది నీకు ఇంకా తెలియలేదు. నువ్వు ఎక్కువగా రేడియోలో క్రికెట్ ను ఫాలో అవుతావేమో అంటూ మరొక అభిమాని మండిపడ్డాడు.ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు అందులో పస ఉండాలనే సంగతి గుర్తు పెట్టుకో డీన్ జోన్స్ అంటూ మరో అభిమాని చురకలంటించాడు. ఆరంభపు మ్యాచ్ లోభారత జట్టు విమర్శించి విమర్శల పాలైన డీన్ జోన్స్, ఇప్పడు హార్దిక్ బౌలింగ్ యాక్షన్ పొగిడి విమర్శలను చవిచూడటం గమనార్హం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)