amp pages | Sakshi

హైదరాబాద్‌ హంటర్స్‌ పరాజయం

Published on Sat, 12/30/2017 - 01:25

న్యూఢిల్లీ: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌కు మరో పరాజయం ఎదురైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన పోరులో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ 4–3 తేడాతో హంటర్స్‌పై గెలుపొందింది. మహిళల సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌తో పాటు ఒక పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ విజయం సాధించగా... పురుషుల డబుల్స్‌లో, మరో పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్‌ గెలిచింది. ముందుగా మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో స్మాష్‌ మాస్టర్స్‌ జోడీ  కేఆర్‌ జుల్‌–ఎల్‌సీహెచ్‌ రెగినాల్డ్‌ 4–15, 15–12, 15–8 స్కోరుతో హంటర్స్‌ జంట బెర్నాడెత్‌–సాత్విక్‌ సాయిరాజ్‌ ఓడించింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్‌ ఆటగాడు లీ హ్యూన్‌ 15–9, 15–11తో సౌరభ్‌ వర్మపై ఘన విజయం సాధించాడు.

మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్‌ 15–5, 15–6తో రసిక రాజేను ఓడించి స్మాషర్స్‌ను ముందంజలో నిలిపింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో అహ్మదాబాద్‌ ట్రంప్‌ మ్యాచ్‌ ఆడిన ప్రణయ్‌ 15–10, 15–8తో సాయిప్రణీత్‌ను ఓడించి తమ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. నామమాత్రమైన చివరి పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌ హంటర్స్‌కు ట్రంప్‌ మ్యాచ్‌గా మారింది. ఇందులో హైదరాబాద్‌ జంట మార్కిస్‌ కిడో–యూ యెన్‌ సియోంగ్‌ 15–14, 15–11తో స్మాష్‌ ద్వయం రెగినాల్డ్‌–కిడాంబి నందగోపాల్‌ను ఓడించినా లాభం లేకపోయింది. 

#

Tags

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)