amp pages | Sakshi

బంతిని తాకాడు.. పెవిలియన్ కు చేరాడు!

Published on Thu, 05/21/2015 - 10:09

లండన్:క్రికెట్ లో నో బాల్ నిబంధన గురించి తెలియని వారుండరు. నో బాల్ లో రనౌట్ రూపంలో మాత్రమే ఆటగాడు పెవిలియన్ కు చేరే అవకాశం ఉంది. మిగతా ఏ రకంగా ఆడినా.. నో బాల్ కు అవుట్ అనేది ఉండదు. అయితే నో బాల్ లో బంతిని తాకినందుకు ఇంగ్లిష్ కౌంటీ క్రికెటర్ అవుటై పెవిలియన్ కు చేరిన ఘటన ఆసక్తికరంగా మారింది.  వివరాల్లోకి వెళితే.. క్రికెటర్ బ్రయాన్ డార్భషైర్(35) .. అమతియర్ తరుపున లీగ్ మ్యాచ్ ఆడుతూ  ఓ బౌలర్ వేసిన నో బాల్ ను డిఫెన్స్ ఆడాడు.  ఆ తరువాత బంతిని చేతితో పట్టుకుని ఫీల్డర్ కు విసిరాడు. దీంతో సదరు ఫీల్డర్ డార్భషైర్ అవుట్ కు అప్పీల్ చేశాడు. ఇంకేముంది  ఫీల్డర్ అప్పీల్ తో అంపైర్ ఏకీభవించడంతో డార్భషైర్ పెవిలియన్ కు చేరడం చకచకా జరిగిపోయాయి. సాధారణంగా ఏ బ్యాట్స్ మెన్ అయినా బంతిని ఆడిన తరువాత చేతితో ఫీల్డర్ కు ఇచ్చినా దాని వల్ల పెద్దగా జరిగే నష్టం జరిగిన దాఖలాలు లేవు.  

 

కాగా, ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాట్స్ మెన్ బంతిని తాకుకూడదనేది  స్థానిక మెర్లీబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) నిబంధన. దీంతోనే డార్భషైర్ అవుటయ్యాడని ఎంసీసీ సలహాదారు మార్క్ విలియమ్స్ స్పష్టం చేశారు.బంతిని తాకే ముందు ఫీల్డర్ అనుమతి తీసుకోవాల్సిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదిలా ఉండగా తాను అవుటైన విధానంతో ప్రత్యర్థి జట్టుపై డార్భషైర్ విమర్శలు గుప్పించాడు. ఆ జట్టుకు అసలు గేమ్ స్పిరిట్ లేదని మండిపడ్డాడు. అంతర్జాతీయంగా ఈ తరహాలో ఓ క్రికెటర్ పెవిలియన్ కు చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)