amp pages | Sakshi

బ్యాడ్ లక్.. పతకం చేజారింది!

Published on Sun, 08/21/2016 - 14:07

రియో డీ జనీరో: ఒలింపిక్స్లో పతకం సాధించడమంటే అదొక ఘనకీర్తి. అసలే కొన్ని దేశాలు పతకాలు  రావడం లేదని తెగ ఆందోళన చెందుతుంటే, అమెరికా జట్టుకు పతకం అందినట్టే  అంది చేజారింది. ఒలింపిక్స్ భాగంగా పురుషుల 4x 100 రిలేలో అమెరికా తృతీయ స్థానంలో నిలిచినా పతకం సాధించడంలో విఫలమైంది ఈ రేసులో తొలి స్థానంలో నిలిచిన జమైకా జట్టు స్వర్ణం గెలిస్తే, జపాన్ రజతం సాధించింది. కానీ లెక్కప్రకారం మూడో స్థానంలో నిలిచిన అమెరికాకు కాంస్యం దక్కాలి. అయితే అమెరికా సాధించింది అనుకున్న పతకం కెనడా జట్టు ఖాతాలో పడింది.

ఇందుకు కారణం నిబంధనల ఉల్లంఘనే. రూల్‌ 170.7 ప్రకారం బాటన్‌ను తర్వాతి రన్నర్‌ టేకోవర్‌ జోన్‌లోనే అందుకోవాలి. ఫోర్ లెగ్లతో కూడిన ఈ రేసులో బాటన్ ను కాస్తా గాట్లిన్ టేకోవర్ జోన్ లోపలే అందిపుచ్చుకున్నాడు. దీని ఫలితంగా నిబంధన ఉల్లంఘన జరిగిందని ఒలింపిక్స్  నిర్వహకులు తేల్చడంతో అమెరికా పతకం చేజారిపోయింది. అమెరికా స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ చేసిన పొరబాటే ఆ జట్టు పతకం కోల్పోవడానికి ప్రధాన కారణమైంది. రేసులో నాల్గో స్థానంలో నిలిచి కెనడాను కాంస్య పతకం వరించింది.

 

ఇప్పటికే పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాకు ఇది  ఓ రకంగా బ్యాడ్ లక్. జమైకా జట్టును సవాల్ చేస్తున్న అమెరికా జట్టు ఇలా వెనుదిరగడం అందర్నీ ఆశ్చర్యాలకు గురి చేసింది. ఇదిలా ఉండగా 4x 100 రిలేలో అమెరికా మహిళల జట్టు స్వర్ణాన్ని సాధించడం విశేషం. గత ఒలింపిక్స్లోనూ  స్వర్ణం  సాధించిన మహిళల జట్టు..డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి సత్తా చాటింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌