amp pages | Sakshi

ఒక్క బంతికి 13 పరుగులు

Published on Sat, 04/06/2019 - 10:51

బెంగళూరు: ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? ఐపీఎల్‌లో ఇది సాధ్యమైంది. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రి రసెల్‌ ఈ ఫీట్‌ సాధించాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రసెల్‌ రప్ఫాడించాడు. సిక్సర్లతో సునామీ ఇన్నింగ్స్‌ ఆడి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 13 బంతుల్లోనే ఏకంగా 48 పరుగులు బాదేసి 5 బంతులు మిగిలుండగానే కోల్‌కతాను గెలిపించాడు.

రసెల్‌ బ్యాట్‌ ఝళిపించడానికి ముందు కోల్‌కతా 16 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉంది. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన 17వ ఓవర్‌ మూడో బంతిని సిక్సర్‌ కొట్టి రసెల్‌ పరుగుల వేట మొదలుపెట్టాడు. అది బీమర్‌ కావడంతో అంపైర్‌ సిరాజ్‌ను తప్పించి అతడి స్థానంలో వచ్చిన స్టాయినిస్‌కు బౌలింగ్‌ ఇచ్చాడు. సిరాజ్‌ బీమర్‌ వేయడంతో  స్టాయినిస్‌ బౌలింగ్‌లో రసెల్‌కు ఫ్రీహిట్‌ ఛాన్స్‌ వచ్చింది. దీన్ని కూడా రసెల్‌ సిక్సర్‌ బాదాడు. దీంతో ఒక్క బంతికే 13 పరుగులు వచ్చినట్లయింది.

స్ట్రైక్‌ రేట్‌ సూపర్‌
ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఆండ్రి రసెల్‌ 77 బంతులు ఎదుర్కొని 268.83 స్ట్రైక్‌ రేట్‌తో 207 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 22 సిక్సర్లు ఉన్నాయి. (చదవండి: బెంగళూరు చిన్నబోయింది)

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?