amp pages | Sakshi

కోహ్లి రిసెప్షన్‌లో అనిల్‌ కుంబ్లే.! ఆశ్చర్యంలో అభిమానులు

Published on Wed, 12/27/2017 - 11:50

ముంబై : టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిల మధ్య వివాదలున్నట్లు అందరికీ తెలిసిందే. అయితే వీరి మధ్య ఈ వివాదాలు సమసిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే దక్షిణాఫ్రికాలో సిరీస్‌ గెలిచే సత్తా కోహ్లి సేనకే ఉందని కుంబ్లే కొనియాడటం.. ముంబైలో జరిగిన కోహ్లి-అనుష్కా రిసెప్షన్‌కు హజరవ్వడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.

కుంబ్లే విరుష్కా రిసెప్షన్‌కు హజరవ్వడంపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. వారి గొడవలు ఆటలో భాగమే.. వ్యక్తిగతం కాదనీ కొందరంటే.. గొడవలు పక్కన పెట్టి కుంబ్లేను కోహ్లి ఆహ్వానించడం.. కుంబ్లే హజరవ్వడం వారి హుందాతానాన్ని చాటుతుందని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొందరైతే కోహ్లి రిసెప్షన్‌కు కుంబ్లే హజరయ్యాడంటే మేము నమ్మమని ట్రోల్‌ చేస్తున్నారు.  

కోచ్‌గా కుంబ్లే ఆటగాళ్లను ఇబ్బంది పెడుతన్నాడని కోహ్లి కామెంట్‌ చేయడం.. దీంతో కోచ్‌ పదవి నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఇద్దరి మధ్య  చాల పెద్ద వివాదం చోటుచేసుకుందని అందరు భావించారు.  ఈ విషయం పలుమార్లు ఈ ఇద్దరు బాహటంగానే వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్‌ 5న టీచర్స్‌డే సందర్భంగా కోహ్లి సోషల్‌ మీడియాలో తన గురువులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫొటోను షేర్‌ చేశాడు. ఈ ఫొటోలో కుంబ్లే లేకపోవడంపై నెటిజన్లు కోహ్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికొకరు బర్త్‌డే విషెస్‌ చెప్పుకోకపోవడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌