amp pages | Sakshi

అతడు ప్రపంచంలోనే చెత్త కీపర్‌!

Published on Sun, 12/15/2019 - 12:22

పెర్త్‌: ఆస్ట్రేలియా టెస్టు సారథి, వికెట్‌ కీపర్‌ టిమ్‌ పైన్‌ను టార్గెట్‌ చేస్తూ నెటిజన్లు వరుస కామెంట్స్‌ చేస్తున్నారు. పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో పైన్‌ చేసిన చిన్న తప్పిదానికి అతడిపై ఆసీస్‌ ఫ్యాన్స్‌ దుమ్మెత్తిపోస్తున్నారు. తొలి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా టిమ్‌ పైన్‌ చెత్త కీపంగ్‌తో కివీస్‌ బ్యాట్స్‌మన్‌ వాట్లింగ్‌ రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

కివీస్‌ బ్యాటింగ్‌ తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా మిచెల్‌ స్టార్‌ వేసిన 35వ ఓవర్‌ ఐదో బంతిని రాస్‌ టేలర్‌ కవర్‌ పాయింట్‌ దిశగా తరలించి సింగిల్‌ తీశాడు. అయితే నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న వాట్లింగ్‌, టేలర్‌ వద్దని వారించినా రెండో పరుగు కోసం సగం క్రీజు వరుకు చేరుకున్నాడు. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న నాథన్‌ లియోన్‌ బంతిని వేగంగా అందుకొని వికెట్‌ కీపర్‌ చేతుల్లోకి విసిరిడు. ఆ సులువైన బంతిని అందుకోవడంలో పైన్‌ విఫలమయ్యాడు. దీంతో వాట్లింగ్‌కు పైన్‌ రూపంలో జీవనధారం లభించింది. సులువైన బంతిని అందుకోడంలో విఫలమైన టిమ్‌ పైన్‌ సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.   

అయితే ఈ రనౌట్‌ మిస్సయినప్పటికీ ఆసీస్‌కు వచ్చిన పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే వాట్లింగ్‌ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 8 పరుగులకే ప్యాట్‌​ కమిన్స్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే చాలా సులువైన బంతిని అందుకోవడంలోనే పైన్‌ తడబడటంపై ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. ‘అసలు పైన్‌ జట్టులో ఎందుకో నాకర్థం కావడం లేదు. కీపింగ్‌లో ఎలాంటి గొప్పతనం, కొత్తదనం లేదు.. ఇక బ్యాటింగ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కేవలం కెప్టెన్‌గా ఉన్నందునే జట్టులో ఇంకా కొనసాగుతున్నాడు. యువ వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీకి అవకాశం ఇచ్చి.. స్మిత్‌కు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి టిమ్‌ పైన్‌ను జట్టు నుంచి సాగనంపడం బెటర్‌’అంటూ ఓ నెటజన్‌ కామెంట్‌ చేయగా.. ‘ప్రపంచంలోనే చెత్త కీపర్‌ టిమ్‌ పైన్‌’ అంటూ మరో నెటిజన్‌ ఆగ్రహం వ్య​క్తం చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో కివీస్‌ ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆసీస్‌ బౌలర్లు చుక్కులు చూపించారు. దీంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది. 250 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ ధాటిగా ఆడటంతో 217 పరుగులకే ఆలౌటైంది.(గాయం కారణంగా హేజిల్‌వుడ్‌ బ్యాటింగ్‌కు దిగలేదు). దీంతో కివీస్‌ ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 

చదవండి: 
ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు..
‘గుర్తుపెట్టుకోండి.. అతడే మ్యాచ్‌ డిసైడర్‌’

 

Videos

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)