amp pages | Sakshi

విండీస్ ధాటికి ఆసీస్‌ విలవిల

Published on Thu, 06/06/2019 - 15:20

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా జట్టు తడబడుతోంది. ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి విండీస్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. తమ కెప్టెన్‌ నిర్ణయం సరైనదేనని చాటుతూ.. ఆరంభం నుంచి ఆ జట్టు బౌలర్లు చెలరేగుతున్నారు. పదునైన విండీస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఆసీస్‌ జట్టు ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. కేవలం 79 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయి.. ఎదురీదుతోంది. 

ఆసీస్‌కు పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నప్పటికీ.. విండీస్‌ బౌలర్లను ఎదుర్కోవడంలో కంగారులు తంటాలు పడుతున్నారు. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (3 పరుగులు), ఆరన్‌ ఫించ్‌  (6 పరుగులు) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన ఉస్మాన్‌ ఖవాజా (13 పరుగులు), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (0), స్టొయినిస్‌(19) కూడా చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న స్టీవ్‌ స్మిత్ (2 పరుగులు)‌, అలెక్స్ కేరీ (1 పరుగు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విండీస్‌ బౌలర్లలో షెల్డన్‌ కాట్రెల్‌ రెండు వికెట్లు తీయగా.. ఒషానే థామస్‌, ఆండ్రూ రస్సేల్‌, హోల్డర్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ తుది జట్టులో మార్పులేమీ లేవు. కానీ, వెస్టిండీస్‌ జట్టులో డారెన్‌ బ్రావో స్థానంలో ఎవిన్‌ లేవిస్‌ జట్టులోకి వచ్చాడు.

వార్నర్, స్మిత్, ఫించ్, ఖాజా, మ్యాక్స్‌వెల్‌లతో పటిష్టంగా ఉన్న ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీసేందుకు విండీస్‌ ఫాస్ట్‌ బౌలర్లు సిద్ధంగా ఉన్నారు. పాక్‌తో తొలి మ్యాచ్‌లో విండీస్‌ పేస్‌ ద్వయం జేసన్‌ హోల్డర్, ఒషాన్‌ థామస్‌ విజృంభించారు. దీంతో పాక్‌ 105 పరుగులకే కుప్పకూలింది. క్రిస్‌ గేల్‌ తొలి మ్యాచ్‌లో తన పవర్‌ చాటుకున్నాడు. ఆండ్రీ రసెల్, బ్రేవో, హెట్‌మైర్‌ బ్యాట్లను ఝళిపిస్తే భారీ స్కోరు ఖాయం. అటువైపు విండీస్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఫించ్‌ బృందం తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది జైత్రయాత్ర మొదలు పెట్టింది. ఆరోన్‌ ఫించ్, డేవిడ్‌ వార్నర్‌ అర్ధసెంచరీలతో చెలరేగారు. అన్ని రంగాల్లో రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నప్పటికీ మైదానంలో వ్యూహాలను సరిగ్గా అమలు చేసే జట్టునే విజయం వరిస్తుందని ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ భావిస్తున్నాడు.  

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్‌ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోనియస్, అలెక్స్ కేరీ (వికెట్‌ కీపర్‌), నాథన్ కౌల్టర్-నైల్, పాట్ కుమ్మినస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

వెస్టిండీస్ జట్టు: క్రిస్ గేల్, ఎవిన్ లెవిస్, షై హోప్ (వికెట్‌ కీపర్‌), నికోలస్ పురన్, షిమోన్ హెట్మీర్, ఆండ్రూ రస్సెల్, జాసన్ హోల్డర్ (కెప్టెన్‌), కార్లోస్ బ్రాత్‌ వెయిట్, యాష్లే నర్స్, షెల్డన్ కాట్రెల్, ఓషనే థామస్

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌