amp pages | Sakshi

ఇలాంటి రనౌట్‌ ఎప్పుడైనా చూశారా?

Published on Thu, 10/18/2018 - 15:23

అబుదాబి: క్రికెట్‌లో రనౌట్లు అనేవి సహజం. పరుగు తీసే క్రమంలో బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌లోకి చేరుకోలేకపోతే రనౌట్‌గా నిష్క్రమిస్తూ ఉంటారు. అయితే స్టైకర్‌-నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు పూర్తిగా రిలాక్స్‌ అయిపోయి పిచ్‌ మధ్యలో ముచ్చట్లు పెట్టే క‍్రమంలో రనౌట్‌ కావడం ఎప్పుడైనా చూశారా.. అయితే ఈ తరహా రనౌట్‌ తాజాగా చోటు చేసుకుం‍ది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య రెండో టెస్టు అబుదాబిలో జరుగుతోంది. గురువారం మూడో రోజు ఆటలో అజహర్‌ అలీ(64) విచిత్రంగా రనౌట్‌ అయ్యాడు.

ఆసీస్‌ పేసర్‌ సిడెల్‌ వేసిన 53 ఓవర్‌ మూడో బంతిని అజహర్‌ అలీ థర్డ్‌ మ్యాన్‌ దిశగా షాట్‌ కొట్టాడు. అది కాస్తా బౌండరీ లైన్‌కు కాస్త దగ్గరగా వెళ్లి ఆగిపోయింది.  ఇది ఫోర్‌గా భావించిన అజహర్‌ అలీ-అసద్‌ షఫిక్‌లు పిచ్‌ మధ్యలో ఆగిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఆ బంతిని అందుకున్న స్టార్క్‌.. కీపర్‌ పైనీకి విసిరాడు. బంతిని అందుకున్న మరుక్షణమే పైనీ వికెట్లను గిరటేశాడు. దాంతో ఒక్కసారిగా షాక్‌ గురైన అజహర్‌ అలీ-అసద్‌ షఫిక్‌లు అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. ఇది నిబంధనల ప్రకారం ఔట్‌ కావడంతో అజహర్‌ అలీ భారంగా పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. మరొకవైపు చిన్నపిల్లాడిలా రనౌట్‌గా పెవిలియన్‌ చేరడం స్టేడియంలోని అభిమానులకు నవ్వులు తెప్పించింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)