amp pages | Sakshi

ట్యాంపరింగ్‌: బయటపడ్డ మరో నిజం

Published on Mon, 03/26/2018 - 13:57

అనూహ్యంగా బయటపడిన బాల్ ట్యాంపరింగ్ వివాదం పెద్ద కుదుపులకే దారి తీస్తోంది. గత రెండు రోజులు నుంచి అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌లపై జీవితకాల నిషేధం వంటి మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్‌ ఆటగాడు కెమరాన్‌ బెన్‌ క్రాప్ట్‌ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వీడియో వైరల్ కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిష్ట మసకబారింది. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏకంగా ఆ దేశ ప్రధాని మార్కమ్ టర్న్‌బుల్ ఆదేశించారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపడుతోంది.

ఇదిలా ఉండగా తాజాగా బయటపడిన ఓ వీడియో ఆస్ట్రేలియా క్రికెట్‌ను మరింత వివాదంలోకి నెట్టింది. గత జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్‌ సిరీస్‌లోనూ కెమరాన్‌ బెన్‌ క్రాప్ట్‌ బాల్‌ టాంపరింగ్‌ చేసినట్టు అనుమానం కలిగిలే ఓ వీడియా ఇప్పుడు బయటకొచ్చింది. అందులో బెన్‌ క్రాప్ట్‌ ఓ స్పూన్‌తో చక్కెర తీసుకుని ప్యాంటు పోకెట్‌లో వేసుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో  బెన్‌ క్రాప్ట్‌ చక్కెరతో బంతి షేప్‌ను మార్చే ప్రయత్నం చేశాడా అన్న సందేశాలు కలుగుతున్నాయి.  సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయినట్టుగా భావిస్తున్నఈ వీడియోను ఓ ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌ ప్రచురించగా, ద సన్‌ రిపోర్టర్‌ డేవిడ్‌ కవర్‌డేల్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. తాజా ఘటనతో క్రికెట్‌ అభిమానులు నివ్వెరపోతున్నారు. అయితే తన కెప్టెన్సీలో ఇలాంటి సంఘటనలు జరగడం మొదటిసారి అని చెప్పిన స్టీవ్‌ స్మిత్‌ మాటలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)