amp pages | Sakshi

ఐపీఎల్-10: క్రిస్ లిన్ వచ్చేశాడోచ్!

Published on Wed, 05/03/2017 - 17:20

న్యూ ఢిల్లీ: ఐపీఎల్-10లో భుజ గాయంతో కొన్ని మ్యాచ్ లకు దూరమైన క్రిస్ లిన్ ఎట్టకేలకు తిరిగి వచ్చాడు. కోల్ కతా నైట్ రైడర్స్  కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్ లీన్ ఈ సీజన్ లో అత్యంత వేగంగా 19 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తొలి అర్ధ భాగంలో  ముంబై తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ  క్రిస్ లిన్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ గాయం తీవ్రం కావడం, ఇప్పటికే మూడు సార్లు అదే భుజానికి గాయం అవ్వడంతో ఐపీఎల్ సీజన్ కు దూరం అవుతాడని అందరూ భావించారు. కానీ క్రిస్ లిన్ మంగళవారం కోల్ కతా జట్టు ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. చాలా దృఢంగా కనిపించిన లిన్ భుజానికి పట్టీలతోనే ప్రాక్టీస్ చేశాడు. క్రిస్ లిన్ ఆడిన రెండు మ్యాచుల్లో ఓపెనర్ గా 125 పరుగులు చేసి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాడు. ఇందులో గుజరాత్ లయన్స్ మ్యాచ్ లో క్రిస్ లిన్ వేగమైన అర్ధ సెంచరీ (93) నమోదు చేయడంతో గుజరాత్  పై కోల్ కతా 10 వికెట్ల తేడాతో గెలిచింది.
 
ఇక గాయంతో లిన్ దూరమవ్వడంతో అతని స్థానంలో ఒపెనర్ గా  స్పిన్ బౌలర్ సునీల్ నరైన్ ను ప్రయోగించి కోల్ కతా విజయం సాధించింది. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా అధికార వైబ్  సైట్ లో కేకేఆర్ అభిమానులు క్రిస్ లిన్ రాక ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారని, మే 9న కింగ్స్ పంజాబ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండగలడని పేర్కొంది. ఇక క్రిస్ లిన్ రాకతో కోల్ కతా జట్టుకు బలం చేకూరనుంది. భుజగాయం నెమ్మదిగా తగ్గుతుందని, గాయమైన మరుసటి రోజు ఇంజక్షన్ తీసుకున్నానని, అది బాగా పనిచేసిందని క్రిస్ లిన్ క్రికెట్.కామ్.ఏయూ లో పేర్కొన్నాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌