అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘టెక్సాస్’ రన్నరప్ దీపిక
Published on Tue, 04/15/2014 - 00:38
హోస్టన్ (అమెరికా): భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈజిప్టు టీనేజ్ సంచలనం, 18 ఏళ్ల నూర్ ఎల్ షెర్బినితో జరిగిన ఫైనల్లో దీపిక 7-11, 11-5, 7-11, 8-11 తేడాతో ఓటమిపాలైంది.
టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలు సాధిస్తూ, టాప్ సీడ్ లో వీ వర్న్తో సహా ముగ్గురు సీడెడ్ క్రీడాకారిణుల్ని ఇంటిబాట పట్టించిన షెర్బిని.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. దీపిక పోరాడినా షెర్బిని దూకుడు ముందు నిలవలేకపోయింది. అయితే 12వ ర్యాంకర్ దీపిక టైటిల్ సాధించలేకపోయినా.. ఫైనల్‌కు చేరడం ద్వారా భారీగా పాయింట్లు సాధించి తిరిగి టాప్-10లో స్థానం సంపాదించుకునే అవకాశాలను సుగమం చేసుకుంది.
#
Tags