amp pages | Sakshi

ఫుట్‌బాల్‌లో ఏదైనా సాధ్యమే

Published on Fri, 06/15/2018 - 04:13

ఆటైనా, జీవితమైనా ఊహించని మలుపులు సహజం. ఇపుడు అలాంటిదే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు స్పెయిన్‌ జట్టులో జరిగింది. మెగా ఈవెంట్‌కు కేవలం ఒక్క రోజు ముందు స్పెయిన్‌ జట్టు తమ కోచ్‌ లొపెటెగోను తప్పించింది. నాకు తెలిసి టోర్నీకి ముందు ఇలాంటి నిర్ణయం ఏ జట్టు తీసుకోదు. ఇది సమీకరణాలను మార్చ గలదు. అర్జెంటీనా, ఐస్‌లాండ్‌ జట్ల మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్‌ కంటే ముందు స్పెయిన్, పోర్చుగల్‌ మ్యాచ్‌పై నేను దృష్టి పెట్టాను. అసలు ఈ మ్యాచ్‌ ఎలా సాగుతుందో అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాను.

కొత్త కోచ్‌ ఫెర్నాండో హియెర్రో, స్పెయిన్‌ ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి. నా వరకైతే ఇది క్లిష్టమైందే కానీ... ఫుట్‌బాల్‌లో అసాధ్యమైంది మాత్రం కాదు. ఎందుకంటే స్పెయిన్‌ ఆటగాళ్లంతా ప్రొఫెషనల్సే. వాళ్లకు వాళ్లమీదున్న బాధ్యతలేంటో బాగా తెలుసు. ఇతరత్రా (కోచ్‌కు ఉద్వాసన) ఆఫ్‌ ది ఫీల్డ్‌ వ్యవహారాలేవీ ఆన్‌ ద ఫీల్డ్‌లో కనిపించకుండా జాగ్రత్తగా ఆడగలరు. సాధారణ పరిస్థితుల్లో అయితే అటాకింగ్‌ స్పెయిన్‌కు, రక్షణాత్మక పోర్చుగల్‌ మధ్య రసవత్తర పోరు తప్పదు.

స్పెయిన్‌ కొత్త కోచ్‌ ఫెర్నాండో కూడా ప్రత్యర్థి జట్టులో క్రిస్టియానో రొనాల్డో ఉన్నప్పటికీ తమ అటాకింగ్‌నే నమ్ముకుంటాడనిపిస్తుంది. రెండేళ్ల క్రితం యూరో (2016) సమరంలో ఎదురైన పోటీనే ఇక్కడ ఉంటుందని నేను ఆశిస్తున్నా. అయితే పోర్చుగల్‌ ఆరంభంలో ఎదురుదాడికి దిగి గోల్స్‌ సాధించడం ద్వారా మ్యాచ్‌పై పట్టు సాధించాలని చూడొచ్చు. రొనాల్డో ఎంతటి ప్రమాదకారో స్పెయిన్‌కు బాగా తెలుసు. ఫీల్డ్‌లో అతనికి ఏ మాత్రం చాన్స్‌ ఇచ్చినా... స్పెయిన్‌ మిడ్‌ఫీల్డ్, డిఫెన్స్‌లపై ఒత్తిడి పెరగడం ఖాయం. కాబట్టి స్పెయిన్‌ ఇక్కడ క్రమశిక్షణతో అడుగేయాల్సి ఉంటుంది

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)