amp pages | Sakshi

దర్యాప్తు అధికారులెవ్వరినీ బదిలీ చేయవద్దు...

Published on Thu, 01/30/2014 - 01:15

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘంలో జరిగిన నిధుల దుర్వినియోగం, టిక్కెట్ల కుంభకోణం తదితర అంశాలపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్న బృందంలోని అధికారులెవ్వరినీ బదిలీ చెయ్యొద్దని హైకోర్టు ఏసీబీ డెరైక్టర్ జనరల్‌ను బుధవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు.
 
  అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో ఫిబ్రవరి 28 నాటికి దర్యాప్తు పూర్తి చేస్తామని మౌఖికంగా చెప్పొద్దని, రాతపూర్వకంగా ఓ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచాలని ఏసీబీ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. హెచ్‌సీఏలో నిధుల దుర్వినియోగం, ఇతర అవకతవకలపై సాగర్ క్లబ్ కార్యదర్శి సి.బాబురావ్ సాగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో 2011లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు, ఈ మొత్తం వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, దర్యాప్తు నివేదికను తమ ముందుంచాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు 2011 ఏప్రిల్ 13న... 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని, నిందితుల్లో ఏ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదని, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తును పర్యవేక్షించాలని హైకోర్టును కోరుతు బాబూరావ్‌సాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ రామ్మోహనరావు విచారించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులెవ్వరినీ కూడా బదిలీ చేయవద్దని స్పష్టం చేశారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం మార్చి 10కి వాయిదా వేశారు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)