amp pages | Sakshi

ధోని బర్త్‌డే స్పెషల్‌.. పదిలం నీ మెరుపులు!

Published on Sat, 07/07/2018 - 11:45

న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని.  నేటి(జూలై7)తో 37 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ధోని తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. భారత క్రికెట్ జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలు పంచుకున్న ధోని..  భారత జట్టు తరపును 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు సారథిగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఐసీసీ వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టీ 20, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను గెలిచి ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు. ఈ క‍్రమంలోనే ధోని మెరుపుల్ని ఒకసారి గుర్తు చేసుకుంది.

1. భారత్ తరపున ఆరు వరల్డ్ టీ 20 ఎడిషన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్

2.  అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌ ధోని. అతని కంటే ముందు సచిన్‌ టెండూల్కర్‌(664), రాహుల్‌ ద‍్రవిడ్‌(509)లు ఉన్నారు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 9వ ఆటగాడు ధోని.  

3. 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 780 ఔట్లలో భాగస్వామ్యమైన ధోని.. ఈ రికార్డు సాధించిన ఓవరాల్‌ మూడో వికెట్‌ కీపర్‌. అతని కంటే ముందు మార్క్‌ బౌచర్‌(998), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌(905)లు ఉన్నారు.

4. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్టంపింగ్‌లు వికెట్‌ కీపర్‌గా ధోని(178) అగ్రస్థానంలో ఉన్నాడు.

5. అంతర్జాతీయ టీ20ల్లో 82 మందిని ఔట్‌ చేసిన ధోని టాప్‌లో ఉన్నాడు.

6.  తొలి టెస్టు, వన్డే సెంచరీలను పాకిస్తాన్‌పై ధోని సాధించగా, ఈ రెండు సందర్బాల్లోనూ 148 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేయడం మరో విశేషం.

7.  ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అత్యధిక సెంచరీలు చేసిన ఘనత ధోనిది. ఏడో స్థానంలో రెండు శతకాలు నమోదు చేసి ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ధోని ఉన‍్నాడు.

8.  వికెట్‌ కీపర్‌గా ఉండికూడా అత్యధిక సార్లు బౌలింగ్‌ చేసిన ఘనత ధోని సొంతం. అతని కెరీర్‌లో 9సార్లు బౌలింగ్‌ చేయగా, తొలి వికెట్‌ను 2009లో వెస్టిండీస్‌పై సాధించాడు.

9. 2007లో ఆఫ్రో-ఆసియా కప్‌లో భాగంగా మహేల జయవర్ధనేతో కలిసి ఆరో వికెట్‌కు ధోని 218 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని సాధించాడు. ఇది వన్డేల్లో ఆరో వికెట్‌కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యం.

10. వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును రెండుసార్లు గెలిచిన ఏకైక క్రికెటర్‌ ధోని.


11.మూడు ఐసీసీ మేజర్ టోర్నమెంట్లను గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్ (వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ).

12. ప్రతీ ఫార్మాట్లోనూ కనీసం 50 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్.

13. వన్డే ఫార్మాట్లో కెప్టెన్గా 110 విజయాలు సాధించిన ధోని.. 74 పరాజయాలను ఎదుర్కొన్నాడు. కనీసం 20 వన్డేలకు సారథ్యం వహించిన భారత ఆటగాళ్ల పరంగా చూస్తే గెలుపు-ఓటముల రికార్డులో ధోనినే అత్యుత్తమ గణాంకాలను కల్గి ఉన్నాడు.

14. ఐదు-అంతకంటే ఎక్కువ జట్లు ఆడిన నాలుగు టోర్నమెంట్లను గెలిచిన ఘనత ధోనిది. ఈ ఘనతను సాధించిన కెప్టెన్ల పరంగా చూస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి ధోని సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.

15. ఎనిమిది టెస్టు హోదా కల్గిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను ధోని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ తొమ్మిది టెస్టు హోదా కల్గిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్లను గెలిచిన వారిలో కెప్టెన్‌గా రికీ పాంటింగ్ ముందున్నాడు. తొమ్మిది టెస్టు దేశాలపై పాంటింగ్ వన్డే సిరీస్‌లను గెలిచాడు. కాగా, బంగ్లాదేశ్‌పై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సాధించడంలో ధోని విఫలం కావడంతో పాంటింగ్ సరసన నిలవలేకపోయాడు.

16. 43 వన్డే సిరీస్‌లకుకు ధోని సారథిగా వ్యహరించాడు. ఇది భారత్ తరపున అత్యధికం కాగా, ఓవరాల్‌గా నాల్గోది.

17. భారత్ సాధించిన విజయాల్లో వన్డే కెప్టెన్‌గా ధోని యావరేజ్ 70.83గా ఉంది. కనీసం వెయ్యి పరుగుల సాధించిన ఓవరాల్ కెప్టెన్లలో ఇది మూడో అత్యుత్తమ యావరేజ్. ఇక్కడ దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, సచిన్ టెండూల్కర్లు ముందువరుసలో ఉన్నారు.

18. 72 ట్వంటీ 20లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్ ధోని

19. భారత జట్టు 110 వన్డే విజయాలకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. భారత్ తరపున ఇదే అత్యధికం కాగా, ఒక జాతీయ జట్టుకు అత్యధిక వన్డే విజయాలను అందించిన రెండో కెప్టెన్ గా ధోని నిలిచాడు. అగ్రస్థానంలో పాంటింగ్(165) ఉన్నాడు.

20. కెప్టెన్ గా ధోని కొట్టిన సిక్స్లులు 126. ఓవరాల్ కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత ధోనిది.

21. 199 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక  భారత్ ఆటగాడు ధోని. ఓవరాల్‌గా మూడో స్థానంలో ఉన్నాడు.

22. అన్ని ఫార్మాట్లలో 331 మ్యాచ్లకు ధోని సారథిగా వ్యవహరించాడు. ఇదే ఓవరాల్‌గా అత్యధికం.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)