amp pages | Sakshi

జూలై 5న ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో...

Published on Wed, 06/03/2020 - 00:03

పారిస్‌: ఎట్టకేలకు ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌ ప్రారంభంకానుంది. మార్చి 15న మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో 2020 సీజన్‌ మొదలుకావాల్సినా...  కరోనా వైరస్‌ కారణంగా సాధ్యపడలేదు. దాంతో ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితోపాటు డచ్, మొనాకో, ఫ్రెంచ్‌ గ్రాండ్‌ప్రి రేసులు రద్దయ్యాయి. మరో ఐదు రేసులు వాయిదా పడ్డాయి. యూరప్‌ దేశాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎఫ్‌1 మేనేజ్‌మెంట్‌ సీజన్‌ మొదలుపెట్టడానికి సిద్ధమైంది. జూలై 5న ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసుతో 2020 సీజన్‌ ఆరంభమవుతుంది.

ఈ రేసు తర్వాత జూలై 12న ఆస్ట్రియాలోనే మరో రేసు జరుగుతుంది. జూలై 19న హంగేరి గ్రాండ్‌ప్రిని నిర్వహిస్తారు. అనంతరం వరుసగా రెండు వారాల్లో ఆగస్టు 2న, ఆగస్టు 9న బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి జరుగుతుంది. ఆగస్టు 16న స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి,  ఆగస్టు 30న బెల్జియం గ్రాండ్‌ప్రి, సెప్టెంబరు 6న ఇటలీ గ్రాండ్‌ప్రి జరుగుతాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమైతే ఎఫ్‌1 సీజన్‌లో మొత్తం 22 రేసులు జరగాలి. అయితే కరోనా మహమ్మారి ప్రభావం ఎఫ్‌1 రేసులపైనా పడింది. ఇప్పటికైతే ఎనిమిది రేసుల తేదీలను ఖరారు చేశారు. పరిస్థితులనుబట్టి ఈ సీజన్‌లో 15 లేదా 18 రేసులు నిర్వహిస్తామని ఎఫ్‌1 వర్గాలు తెలిపాయి.

Videos

చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి

ఆధారాలు ఉన్నా..నో యాక్షన్..

వైఎస్ఆర్ సీపీనే మళ్ళీ గలిపిస్తాం

ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని

జగన్ వెంటే జనమంతా..

బాబు, పవన్ కు కర్నూల్ యూత్ షాక్

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)