amp pages | Sakshi

ధ్యాన్‌చంద్‌కు ‘భారతరత్న’ ఇవ్వండి

Published on Thu, 06/08/2017 - 00:04

న్యూఢిల్లీ: దివంగత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ అవార్డు ఇవ్వాలని కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయెల్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. హాకీ మైదానంలో తన అద్భుతమైన ప్రదర్శనతో అడాల్ఫ్‌ హిట్లర్‌లాంటి నియంతనే మెప్పించిన అలనాటి హాకీ హీరో... భారత్‌కు ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ (1928, 1932, 1936) స్వర్ణ పతకాలు అందించారు. జాతీయ క్రీడ హాకీకి విశేష సేవలందించిన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ను అత్యున్నత పౌర పురస్కారంతో గుర్తించాలని గోయెల్‌ పేర్కొన్నారు. లేఖ రాసిన విషయం నిజమేనని ఆయన ధ్రువీకరించారు.

‘ఔను... ప్రధానికి లేఖ రాశాం. హాకీకి ఎనలేని కృషి చేసిన మేజర్‌కు ‘భారతరత్న’తో ఘన నివాళి అర్పించాలని అందులో పేర్కొన్నాం’ అని  గోయెల్‌ వెల్లడించారు. 2013లో తొలిసారిగా క్రీడల విభాగంలో భారత ప్రభుత్వం క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఈ పురస్కారం అందించింది. కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన టెస్టు మ్యాచ్‌ ముగిసిన గంటల వ్యవధిలోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం సచిన్‌కు ఈ అవార్డును ప్రకటించింది. అయితే క్రికెట్‌ దిగ్గజం కంటే ముందుగా ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాల్సిందని క్రీడల మంత్రి అభిప్రాయపడ్డారు.

2011లో 82 మంది ఎంపీలు ధ్యాన్‌చంద్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలని పట్టుబట్టినా... అవార్డుల అర్హుల నియమావళిలో క్రీడారంగం లేదని ప్రభుత్వం తోసిపుచ్చింది. ధ్యాన్‌చంద్‌ జయంతి (ఆగస్టు 29)ని పురస్కరించుకొని ఆ రోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని ధ్యాన్‌చంద్‌ కుమారుడు అశోక్‌ కుమార్‌ సహా 100 మంది మాజీ క్రీడాకారులు అప్పట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)