amp pages | Sakshi

ఇండియన్ హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా

Published on Tue, 10/21/2014 - 15:54

న్యూఢిల్లీ: హాకీ ఇండియా కోచ్ టెర్రీ వాల్ష్ తన పదవికి రాజీనామా చేశారు. పారితోషికం విషయంలో హాకీ ఇండియాతో చోటు చేసుకున్న విభేదాలతో వాల్ష్ రాజీనామాకు సిద్ధమైయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ వాల్ష్ గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే భారత హాకీ జట్టు కోచ్ గా నియమితులైయ్యారు.  నాలుగు ప్రపంచకప్‌లు, మూడు ఒలింపిక్స్‌లు ఆడిన అనుభవం ఉన్న వాల్ష్ ను హాకీ కోచ్ గా ప్రవేశపెట్టిన అనంతరం భారత్ హాకీ మెరుగైన ఫలితాలను సాధించింది. తాజాగా దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకోవడంలో కూడా వాల్ష్ పాత్ర కొనియాడకుండా ఉండలేం. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.

 

ప్రస్తుతం హాకీ ఇండియాతో పేమెంట్ల వ్యవహారంలో చోటు చేసుకున్న విభేదాలే అతని రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.1990లో కోచింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఆయన మలేసియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల ప్రధాన కోచ్‌గా పనిచేశారు.త్వరలో రియో ఒలింపిక్స్ లో కూడా హాకీ ఇండియా ఆశించిన ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్న తరుణంలో వాల్ష్ రాజీనామా బాట పట్టారు.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)