amp pages | Sakshi

పవర్‌ ప్లేయర్‌ కాదు.. ఎక్స్‌ట్రా అంపైర్‌!

Published on Tue, 11/05/2019 - 20:41

సాక్షి, ముంబై : అన్నీ కుదిరితే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 13 కొత్త పుంతలు తొక్కనుంది. దీనిలో భాగంగా పలు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ‘పవర్‌ ప్లేయర్‌’ అనే కొత్త ప్రతిపాదన గవర్నింగ్‌ కౌన్సిల్‌ ముందుకు వచ్చింది. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తుది నిర్ణయమని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. అయితే పవర్‌ ప్లేయర్‌పై చర్చ జరుగుతుండగానే మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గత ఐపీఎల్‌లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వారిపై పని ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో మైదానంలో మరో ఎక్స్‌ట్రా అంపైర్‌ను ఉంచాలని గవర్నింగ్‌ కౌన్సిల్‌ భావిస్తోంది. అయితే ఈ ఎక్స్‌ట్రా అంపైర్‌ కేవలం ‘నో బాల్‌’ చెక్‌ చేయడానికి మాత్రమేనని తెలుస్తోంది. అయితే దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రయోగాత్మకంగా ముస్తాక్‌ అలీ ట్రోఫీలో పరిశీలించాలని బీసీసీఐ భావిస్తోంది. 

ఫ్రంట్‌ ఫుట్‌, హైట్‌ నోబాల్‌ నిర్ణయాలను మాత్రమే తీసుకునే అధికారం ఎక్స్‌ట్రా అంపైర్‌కు ఉంటుందని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని, దీనిపై అధ్యక్షుడు గంగూలీ కూడా సుముఖంగా ఉన్నాడని ఆ అధికారి తెలిపారు. అయితే వచ్చే ఐపీఎల్‌కు ఎక్కువ సమయం లేనందున ‘పవర్‌ ప్లేయర్‌’ను ఈసీజన్‌లో అమలు చేయడం కుదరదని గవర్నింగ్‌ కౌన్సిల్‌ తేల్చిచెప్పింది. అంతేకాకుండా పవర్‌ ప్లేయర్‌ నిబంధనకు గంగూలీ ఆమోదముద్ర వేయలేదని తెలుస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనను తరువాతి ఐపీఎల్‌కు వాయిదా పడింది. ఇక గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌ సందర్భంగా చివరి బంతిని లసిత్‌ మలింగ నోబాల్‌ వేసనప్పటికీ అంపైర్‌ గుర్తించలేదు. అంపైర్‌ తప్పుడు నిర్ణయంతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఆ బంతిని అంపైర్‌ నోబాల్‌ ప్రకటించి ఉంటే ఫలితం ఆర్సీబీకి అనుకూలంగా ఉండేది. అయితే ఇదే విషయాన్ని మ్యాచ్‌ ముగిసిన అనంతరం విరాట్‌ కోహ్లి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)