amp pages | Sakshi

ఆ ఇద్దరితో మాకు కష్టమే: న్యూజిలాండ్‌ కెప్టెన్‌

Published on Sun, 10/15/2017 - 19:08

సాక్షి, ముంబై: భారత యువ స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌లను ఎదుర్కోవడం కష్టమైన పనేనని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు నైపుణ్యం గల బౌలర్లని, ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. ఈనెల 22 నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనేందుకు ఇక్కడి వచ్చిన సందర్భంగా విలియమ్సన్‌ మీడియాతో ముచ్చటించారు. చైనామన్‌ బౌలర్లు అరుదుగా ఉంటారని, వారిని ఎదుర్కోవడం చాలెంజ్‌తో కూడుకున్నదన్నారు. ఇక కుల్డీప్‌, చాహాల్‌ బౌలింగ్‌ నైపుణ్యం చాలా బాగుందన్నారు. కానీ  ఇక్కడి పరిస్థితులను అందిపుచ్చుకోవడమే మాకు పెద్ద సవాలని విలియమ్సన్‌ చెప్పుకొచ్చారు.

ఇక సీనియర్‌ స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాలు జట్టులో లేకపోవడంపై విలియమ్సన్‌ ప్రశ్నించగా.. వారు లేకపోవడం మాకు కూడా ఆశ్చర్యం కలిగించిందన్నారు. కానీ భారత్‌లో ప్రతిభ కలిగిన క్రికెటర్లు ఉన్నారని, భారత్‌ ఈ మధ్య ఎక్కువ మ్యాచ్‌లు ఆడిందన్నారు.  ప్రతి ఒక్కరు అన్ని ఫార్మాట్‌లు ఆడటం కష్టమని, బిజీ షెడ్యూల్‌ వల్ల కొందరికి విశ్రాంతి ఇవ్వడం క్రికెట్‌లో సహజమేనని అభిప్రాయపడ్డారు. మేము గత వేసవిలో ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో భారత్‌ మరింత దృడంగా తయారైందన్నారు. ఇక ఆస్ట్రేలియాపై కుల్‌దీప్‌ హ్యాట్రిక్‌ తీయడం తనను ఎంతగానో ఆకట్టుకుందని విలియమ్సన్‌ కొనియాడాడు. గతేడాది సిరీస్‌ (3-2) చేజారడం నిరాశపరిచిందని, ఈ సారి అవకాశం ఇవ్వకూడదని కివీస్‌ ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. చాలా మంది ప్లేయర్లకు ఇక్కడ ఆడిన అనుభవం ఉందన్నారు.

​కివీస్‌ కోచ్‌  మైక్ హెస్సన్ మాట్లాడుతూ.. ‘కుల్‌దీప్‌, చాహల్‌ బౌలింగ్‌ను ఐపీఎల్‌లో మా ఆటగాళ్లు చాల మంది ఎదుర్కొన్నారు. కొందరు కుల్‌దీప్‌ సహచరులుగా అతని మణికట్టు విద్యను గమనించారు. మణికట్టు స్పిన్నర్లు ఎక్కువగా పరుగుల ఇచ్చే అవకాశం కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మేం విజయవంతమైనట్లేనని’ మైక్‌ తెలిపారు.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)