amp pages | Sakshi

ఇదీ క్రీడా స్ఫూర్తి..!

Published on Thu, 07/05/2018 - 01:34

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అంటేనే యుద్ధం మాదిరిగా రెండు జట్ల మధ్య చావోరేవో అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతుంది. ఆశించిన మేర ఫలితం రాకపోతే ఇరుజట్ల అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు, రక్తపాతాలకు దారి తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత ప్రపంచకప్‌ మ్యాచ్‌ సందర్భంగా అందుకు పూర్తి విరుద్ధంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అటు అభిమానులు, ఇటు ఆటగాళ్ల క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి. బెల్జియంతో జరిగిన మ్యాచ్‌ చివర్లో జపాన్‌ జట్టు ఆశలు గల్లంతు కావడంతో స్టేడియంలోని అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. రష్యాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లు చూసేందుకు జపాన్‌ నుంచి వెళ్లిన వేలాదిమంది ఈ ఓటమితో ప్రపంచకప్‌ పోటీల నుంచి తమ జట్టు వైదొలగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయినా పంటి బిగువున ఆ బాధను భరిస్తూనే తాము వీక్షించిన స్టేడియంలోని చెత్తాచెదారమంతా శుభ్రం చేశారు.

ఈ మ్యాచే కాకుండా అంతకుముందు తమ జట్టు పాల్గొన్న నాలుగు మ్యాచ్‌లలోనూ ఇదే రకమైన నైతిక విలువలు, స్ఫూర్తిని ప్రదర్శించారు.  ఈ మ్యాచ్‌ తర్వాత  నీలం రంగు ‘సమురాయ్‌ డ్రెస్‌’ ధరించిన అభిమానులు స్టేడియమంతా కలియతిరుగుతూ చెత్త ఏరుతున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓటమి చవిచూసిన జపాన్‌ జట్టు కూడా అత్యున్నత క్రీడా స్ఫూర్తిని, తమ దేశ క్రమశిక్షణను చేతల్లో చూపింది. స్టేడియంలోపల తమ జట్టుకు కేటాయించిన లాకర్‌ రూమ్‌లోని కుర్చీలు, సామగ్రిని ఆటగాళ్లు మిలమిల మెరిసేలా శుభ్రపరిచారు. ఓటమికి కుంగిపోకుండా రష్యన్‌ భాషలో ‘ధన్యవాదాలు’ అనే నోట్‌ను అక్కడ వదిలి వెళ్లారు. ప్రపంచకప్‌ పోటీల నుంచి తమ జట్టు నిష్క్రమించినా జపాన్‌ ఆటగాళ్లు, అభిమానులు అందరి మనసులు గెలుచుకున్నారు. జపాన్‌ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల తర్వాత అభిమానులు ఈ విధంగా స్టేడియాలను శుభ్రపరచడం  జపనీస్‌ సంస్కృతిలో అంతర్భాగమని ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్‌ స్కాట్‌ మ్యాక్‌ఇన్‌టైర్‌ చెబుతున్నారు. జపాన్‌ దేశ క్రీడాభిమానుల నుంచి స్ఫూర్తి పొందిన సెనెగల్‌ అభిమానులు కూడా గతంలో స్టేడియాన్ని శుభ్రపరిచారు. తమ జట్టు పోలాండ్‌పై గెలిచిన ఉత్సాహంతో వారు ఆ పనిచేశారు. 

Videos

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)