amp pages | Sakshi

అరంగేట్రం అదిరింది..

Published on Mon, 04/23/2018 - 21:48

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కింగ్స్‌ పంజాబ్‌ మ్యాచ్‌ ఆద్యంతం తడబాటుకు గురైంది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ మెరుపులు మెరిపించకపోవడంతో కింగ్స్‌ పంజాబ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌(2) తీవ్రంగా నిరాశపరచగా, కేఎల్‌ రాహుల్‌(23), మయాంక్‌  అగర్వాల్‌(21)లు సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆపై గేల్‌ స్థానంలో వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌(26) కూడా విఫలమయ్యాడు.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో కరుణ్‌ నాయర్‌(34)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఏ దశలోనూ కింగ్స్‌ పంజాబ్‌ను ఢిల్లీ బౌలర్లు కోలుకోనీయకుండా చేశారు. ప్రధానంగా ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఇంగ్లిష్‌ బౌలర్‌ లియామ్‌ ప్లంకెట్‌ అదరగొట్టాడు. కింగ్స్‌ పంజాబ్‌ మూడు ప్రధాన వికెట్లను తీయడంతో పాటు మెరుపులాంటి క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇవ్వడం మరో విశేషం. అతనికి జతగా అవీష్‌ ఖాన్‌, బౌల్ట్‌ తలో రెండు వికెట్లు సాధించగా, డానియల్‌ క్రిస్టియన్‌ వికెట్‌ తీశాడు. దాంతో కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది.

Videos

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు

కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?