amp pages | Sakshi

ప్లేఆఫ్‌కు చేరువగా కేకేఆర్‌..

Published on Tue, 05/15/2018 - 23:31

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ ఈడెన్‌ గార్డెన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్‌ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో ఛేదించింది. కోల్‌కతా బ్యాటింగ్‌లో క్రిస్‌ లిన్‌(45), దినేశ్‌ కార్తీక్‌(41 నాటౌట్‌; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌), సునీల్‌ నరైన్‌(21; 7బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్‌ రాణా(21; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌)లు మెరిసి జట్టుకు విజయాన్ని అందించారు. ఫలితంగా ఏడో విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్‌ ప్లేఆఫ్‌కు చేరువగా వచ్చింది.

ఈ మ్యాచ్‌లో సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో కోల్‌కతా ఇన్నింగ్స్‌ను సునీల్‌ నరైన్‌ దూకుడుగా ఆరంభించాడు. తొలి ఓవర్‌లోనే 21 పరుగులు సాధించి కేకేఆర్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే రెండో ఓవర్‌లో నరైన్‌(21) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన రాబిన్‌ ఉతప్ప(4) నిరాశపరిచాడు. ఆ తరుణంలో క్రిస్‌ లిన్‌తో జత కలిసిన నితీశ్‌ రాణా ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 33 పరుగులు జత చేసిన తర్వాత నితీశ్‌ రాణా ఔటయ‍్యాడు. ఆపై దినేశ్‌ కార్తీక్‌తో కలిసి 48 పరుగులు జత చేసిన తర్వాత లిన్‌ పెవిలియన్‌ చేరడంతో కేకేఆర్‌ 117 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను నష్టపోయింది. ఇక మ్యాచ్‌ను కార్తీక్‌-రస్సెల్‌(11 నాటౌట్‌; 5 బంతుల్లో 2 ఫోర్లు)లు మరో వికెట​ పడకుండా ఆడి ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగా జట్టుకు విజయాన్ని అందించారు.

అంతకుముందు రాజస్తాన్‌ రాయల్స్‌ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్‌ స్సిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ విజృంభించి బౌలింగ్‌ చేయడంతో రాజస్తాన్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. తన నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటాలో కుల్దీప్‌ 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లతో రాజస్తాన్‌ను దెబ్బ తీశాడు. అతనికి జతగా ఆండ్రీ రస్సెల్‌, ప్రసిధ్‌ కృష్ణలు చెరో రెండు వికెట్లు సాధించగా, మావి, సునీల్‌ నరైన్‌ తలో వికెట్‌ తీశారు.

టాస్‌ ఓడి తొలుత బ‍్యాటింగ్‌ చేపట్టిన రాజస్తాన్‌కు శుభారంభం లభించింది. రాజస్తాన్‌ ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి, జోస్‌ బట్లర్‌లు ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. వీరిద్దరూ కలిసి 4.5 ఓవర్లలో 63 పరుగులు జత చేసిన తర్వాత రాహుల్‌ త్రిపాఠి(27;15 బంతుల్లో4 ఫోర్లు, 1 సిక్సర్‌) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై మరో 13 పరుగుల వ్యవధిలో అజింక్యా రహానే(11) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి బట్లర్‌(39; 22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) నిష్ర్కమించడంతో రాజస్తాన్‌ 85 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక అటు తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ ఏ దశలోనూ తేరుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ అందివచ్చిన చక్కటి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. సంజూ శాంసన్‌(12),  స్టువర్ట్‌ బిన్నీ(1), గౌతమ్‌(3), స్టోక్స్‌(11)లు ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరారు. ఇక చివర్లో ఉనాద్కత్‌(2​‍​‍6;18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) ఫర‍్వాలేదనిపించాడు.

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)