రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విరాట్ కోహ్లికి గాయం!
Published on Thu, 03/16/2017 - 13:14
రాంచీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి చేతికి గాయమైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో విరాట్ బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపబోయి గాయపడ్డాడు. రవీంద్ర జడేజా వేసిన 39 ఓవర్ తొలి బంతిని ఆస్ట్రేలియా ఆటగాడు హ్యాండ్ స్కాంబ్ బౌండరీకి తరలించే యత్నం చేశాడు.
అయితే ఆ బంతిని ఆపే క్రమంలో విరాట్ బౌండరీ లైన్ వద్ద డైవ్ కొట్టాడు. ఇక్కడ విరాట్ ఒక పరుగును సేవ్ చేసినప్పటికీ భుజానికి గాయమైంది. దాంతో విరాట్ మైదానం వీడి వెళ్లక తప్పలేదు. కాకపోతే ఆ గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది.
#
Tags