amp pages | Sakshi

లక్ష్యసేన్‌ సంచలన విజయం

Published on Sun, 09/15/2019 - 11:44

బ్రూసెల్స్‌:  గతేడాది జరిగిన యూత్‌ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గి ఈ ఫీట్‌ను సాధించిన రెండో భారతీయ షట్లర్‌గా గుర్తింపు పొందిన లక్ష్యసేన్‌.. ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను అందుకున్నాడు. బెల్జియం ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ టైటిల్‌ను లక్ష్యసేన్‌ కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌.. తన కంటే ఎంతో మెరుగైన రెండో సీడ్‌ విక్టర్‌  స్వెండ్‌సెన్‌(డెన్మార్క్‌)పై సంచలన విజయం సాధించి టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. 34 నిమిషాలు పాటు జరిగిన  పోరులో లక్ష్యసేన్‌ 21-14, 21-15 తేడాతో స్వెండ్‌సెన్‌ను మట్టికరిపించాడు.

తొలి గేమ్‌లో 13-12తో ఆధిక్యంలో నిలిచిన లక్ష్య సేన్‌ అదే జోరును ఆ తర్వాత కూడా కొనసాగించాడు. ఆ క‍్రమంలోనే తొలి గేమ్‌ను గెలిచి పట్టు సాధించాడు. ఇక రెండో గేమ్‌లో దూకుడుగా ఆడాడు. తొలుత 6-2 ఆధిక్యంలో నిలిచిన లక్ష్య సేన్‌.. వరుసగా ఐదు పాయింట్లు సాధించి 11-3తేడాతో దూసుకుపోయాడు. ఆపై స్వెండ్‌సెన్‌ ప్రతి ఘటించినా గేమ్‌ను నిలబెట్టుకోలేపోయాడు. దాంతో గేమ్‌తో  పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకుని టైటిల్‌ను సాధించి 18 ఏళ్ల లక్ష్య సేన్‌ చాంపియన్‌గా అవతరించాడు.  

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)